మేడమ్ టుస్సాడ్స్‌లో సన్నీ మైనపు బొమ్మ..

289
madame tussauds
- Advertisement -

పోర్న్‌స్టార్‌ నుండి ఫిలింస్టార్‌ గా మారిన బ్యూటీ సన్నీలియోన్‌. ఈ సెక్స్ బాంబ్ సన్నీలియోన్ ఏం చేసినా సెక్సీగా ఉంటుంది. అందుకే ఈ శృంగార తారకి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నారు. యువత గుండెల్లో శృంగార దేవతగా చోటు సంపాదించుకున్న సన్నీ క్రేజ్ అంతా ఇంత కాదు.

పోర్న్‌ సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా సన్నీకి అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్‌లో సన్నీ మైనపు విగ్రహం చేరింది. ఇందులో విశేషమేమిటంటే తన విగ్రహాన్ని తానే ఆవిష్కరించుకోవడం. ఆ వివరాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. మేడం టుస్సాడ్స్‌లో తన బొమ్మను తానే చూసుకోవడం అద్భుతుమైన అనుభూతిని కలిగించిందని సన్నీ ఆనందం వ్యక్తం చేసింది.

Image result for sunny leone wax statue

అమితాబ్ బచ్చన్, విరాట్ కోహ్లీ, షారుక్‌ ఖాన్‌ సరసన చేరింది సన్నీ. ఇటీవలె గూగుల్‌లో అత్యధికులు సెర్చ్ చేసిన వ్యక్తిగా రికార్డుకెక్కిన ఈ శృంగార తార తాజాగా మేడమ్ టుస్సాడ్స్ అమ్ముల పొదిలో చోటు సంపాదించుకోవడం విశేషం.

- Advertisement -