తమ్ముడి కోసం రంగంలోకి దిగిన అన్నయ్య..

302
Actor Ali
- Advertisement -

కమెడియన్‌ అలీ సోదరుడు ఖయూమ్‌ హీరోగా తనిష్క్‌, రాజన్‌, షానీ, పృథ్విరాజ్‌, సమీర్‌, లోహిత్‌ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘దేశంలో దొంగలు పడ్డారు’. సారా క్రియేషన్స్‌ పతాకంపై రూపొందింది. గౌతమ్‌ రాజ్‌కుమార్‌ దర్శకుడు. రమా గౌతమ్‌ నిర్మాత. ఆలీ ఈ చిత్రానికి సమర్పకుడు. చిత్ర ట్రైలర్‌ ఇటీవల రామానాయుడు స్టూడియోలో ఆవిష్కరించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Actor Ali

ఇక ఈ సినిమాతో నటుడిగా తన తమ్ముడిని సెటిల్ చేసే బాధ్యతను అలీ తీసుకున్నాడు. ఇదివరకు ఖయ్యుమ్ చాలా సినిమాల్లో హీరో ఫ్రెండ్స్‌లో ఒకరిగా .. ఇద్దరు ముగ్గురు హీరోల్లో ఒకరిగా కనిపిస్తూ వస్తున్నాడు. అయితే ఇంతవరకూ ఆయనకి సరైన బ్రేక్ రాలేదు. దాంతో ఖయ్యుమ్ హీరోగా రూపొందుతోన్న ‘దేశంలో దొంగలు పడ్డారు’ సినిమా కోసం అలీ సమర్పకుడిగా మారిపోయాడు. తమ్ముడిని నిలబెట్టడం కోసం అలీ చేస్తోన్న ప్రయత్నం ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.

- Advertisement -