తెరముందు…తెర వెనుక ‘రచ్చబండ’… రచ్చ..రచ్చే

303
online news portal
- Advertisement -

బతుకు జట్కా బండి, సంసారం ఓ చదంరంగం, రచ్చబండ .. .ఏంటీ పేర్లు అనుకుంటున్నారా. ఇవన్నీ టాప్ తెలుగు ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్స్ లో వస్తున్న ఫ్యామిలీ రియాల్టీ షోలు. అంటే కాపురాలు చక్కదిద్దుతామంటూ బయల్దేరిన ఛానెళ్లన్నీ.. మాజీ హీరోయిన్లను యాంకర్లుగా పెట్టి వ్యూయర్స్ ను ఎట్రాక్ట్ చేసుకుంటున్నాయి. ఫైర్ బ్రాండ్ గా, జబర్దస్ట్ స్టార్ గా పాపులరైన రోజా నిర్వహిస్తున్న రచ్చబండ రేటింగులతో రోజాకు కూడా కొత్త ఉత్సాహం వచ్చినట్లు కనిపిస్తోంది. అసెంబ్లీలో ఫైర్ బ్రాండ్ అయిన రోజా.. రచ్చబండలోనూ రచ్చ రచ్చ చేస్తోంది. ఓ భర్త భార్యకు చేసిన అన్యాయ్ం విని, రెచ్చిపోయి చెంప చెళ్లు మనిపించి బుల్లితెర హట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. తనదైన మాటల తూటాలతో సీరియస్‌ క్రియేట్ చేసింది రోజా.

వివిధ రకాల కుటుంబ సమస్యలను షో 30 నిమిషాల వ్యవధిలో రోజా చాలా అవలీలగా పరిష్కరిస్తుంటుంది. చాలా వరకు ఇందులో భార్య, భర్తల మధ్య వచ్చే సమస్యలే ఉంటాయి.. వాటిని ఈవిడ పరిష్కరిస్తుంటారు.. ఇది తెరముందు జరిగేది.. అందరికి తెలిసింది.. కానీ తెర వెనుక కథ ఇది కాదు. దీనికి పూర్తి వ్యతిరేకం.. తెరముందు మనకు రచ్చబండ సెట్ ఎంత సీరియస్‌గా కనిపిస్తుందో.. తెర వెనక్కు వెళ్తే అంతా కామెడీనే.

తెరముందు ఎంతో హుందాగా ఉండే రోజా ఒక్కసారి కెమెరా ఆఫ్ అయితే ఆమె ప్రవర్తనే వేరు.. ఇందుకు నిదర్శనం ఈ వీడియోనే.. రచ్చబండ సెట్‌లో ఒకరి పుట్టినరోజు వేడుకలు జరిగాయి.. ఈ సందర్భంగా రోజా, పుట్టినరోజు జరుపుకుంటున్న ఆ అమ్మాయితో కలిసి చిందులు వేసింది. పాపులర్ అయిన ఓ ఐటం పాటపై ఈవిడ ఇప్పటి హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా స్టెప్పులు వేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఈ వీడియోను చూసిన కొందరు లైట్ తీసుకున్న, కొందరు మాత్రం బాధ్యతగల పదవిలో ఉండి ఆమె ఈ విధంగా డ్యాన్స్ చేయడం ఏంటి అని విమర్శింస్తున్నారు.

https://youtu.be/ZpJkhnFdb-c

- Advertisement -