సంతలో.. స‌మంత‌..!

273
samantha
- Advertisement -

అక్కినేని వారి కోడలు సమంత స్టార్ హీరోయిన్‌గా ఇటు టాలీవుడ్‌లో అటు కోలీవుడ్‌లో వరుస సినిమాలతో దుసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ అందాల భామ సినిమా షూటింగులతో – బ్రాండ్ ఎండార్స్ మెంట్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ వీలు చేసుకుని మరీ సమాజసేవా కార్యక్రమాలలో పాల్గొంటుంది. ప్రత్యూష చారిటబుల్‌ ట్రస్ట్‌ పేరుతో సమంత అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Actress Samantha

తాజాగా ఈ అమ్మడు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల శస్త్రచికిత్సకి కావ‌ల‌సిన‌ ఆర్థిక సహాయం కోసం నిధులను సేకరిస్తున్నారు. ఈ క్ర‌మంలో చెన్నైలోని ట్రిప్లికేన్‌లో ఉన్న కూర‌గాయ‌ల దుకాణం ముందు కూర్చొని కూర‌గాయ‌లు అమ్మింది. స‌మంత‌ని చూసి అక్క‌డి జ‌నం భారీగా త‌ర‌లి వ‌చ్చారు.

samantha

కొద్ది నిమిషాల‌లోనే షాప్‌లోని కూర‌గాయల‌న్నీ అమ్ముడుపోయాయి. స‌మంత చేస్తున్న మంచి ప‌నులకి నెటిజ‌న్స్ ఆమెపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇక స‌మంత న‌టించిన యూటర్న్ సినిమా సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -