నర్తనశాలలో నవ్వులు పరవాలేదు – రివ్యూ

267
Nartanasala Review, 2018 Nartanasala movie review, @Nartanasala
- Advertisement -

ఐరా క్రియేషన్స్ పతాకం పై ఉష ముల్పూరి నిర్మాణ సారథ్యంలో నాగశౌర్య కథానాయకుడిగా తెరకెక్కిన “@నర్తనశాల” సినిమా ఈ రోజే ప్రేక్షకులముందుకు వచ్చింది. శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో నాగశౌర్య ఓ “గే” పాత్రలో నటించారన్న విషయం బాగా ప్రచారాన్నందుకోని సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో పెంచుతూ వచ్చింది. ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో చిత్ర బృందం ఎంతవరకు విజయం సాధించిందో చూద్దాం.

కథ:
కళామందిర్ కళ్యాణ్ ( శివాజీ రాజా ) తండ్రి తన కొడుక్కి చనిపోయిన తన భార్యే కూతురిగా పుడుతుందని ఎంతో నమ్మకం పెట్టుకుని ఉంటాడు . కానీ వారి దురదృష్టవశాత్తు కొడుకు పుడతాడు. దాంతో తన తండ్రి ఎక్కడ మనస్థాపానికి గురవుతాడో అని భయపడి తన కొడుకుని కూతురిగా పెంచుతాడు శివాజీ రాజా. అలా అబ్బాయిగా పుట్టి అమ్మాయిలా పెరిగినవాడే నాగశౌర్య. పెద్దయ్యాక మహిళలకు రక్షణ ఇచ్చే ట్రైనింగ్ లో శిక్షణ ఇచ్చే నాగశౌర్య కు సన్యాసికావాలని కోరుకునే మేఘన ( కాశ్మీర పరదేశి) తో పరిచయం ఏర్పడుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో మేఘనను నాగశౌర్య కాపాడే ప్రయత్నం చేయగా అది చూసి మేఘన ప్రేమలో పడుతుంది. తరువాత సత్యభామ ( యామిని భాస్కర్ ) అనే మొండిఘటం లాంటి అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. సత్యభామకుడా నాగశౌర్యని ప్రేమిస్తుంది. అది చూసిన నాగశౌర్య తండ్రి శివాజీ రాజా తన కొడుకు సత్యభామను ప్రేమిస్తున్నాడనుకుని, సత్యభామ తండ్రి రాయుడుని (జయప్రకాశ్ రెడ్డి) కలిసి పెళ్లి కుదుర్చుకుంటాడు. కానీ నాగశౌర్య మేఘన ను ప్రేమిస్తున్నాడని చెప్పడం తో శివాజీ రాజా షాక్ అయ్యి రాయుడు చాలా పవర్ ఫుల్ అని, ఇప్పుడు వద్దంటే చంపేస్తాడని భయపడటంతో నాగ శౌర్య రాయుడిని కలిసి తనో “గే” అని చెప్పి తప్పించుకోవాలనుకుంటాడు. కానీ తను గే అని చెప్పడం వల్లే తనకింకో సమస్య ఎదురవుతుందని ఊహించని నాగశౌర్య ఆ సమస్యను ఎలా ఎదుర్కున్నాడు, అసలా సమస్యేంటి? అనేది కథాంశం.

సమీక్ష :
ఛలో మూవీ తో మంచి హిట్ అందుకున్న నాగశౌర్య అలాంటి వినోదాత్మక కథనే ఎంచుకుని మళ్ళీ హిట్ కొట్టడానికి వచ్చాడు. అయితే హిట్టా ఫట్టా అనే విషయం పక్కన పెడితే ఇంత సీరియస్ కథని కూడా పూర్తి హాస్య కోణం లో మార్చి ప్రేక్షకులను నవ్వించడానికి చాలా కష్టపడ్డారనే చెప్పాలి. నాగశౌర్య ఈ సినిమాలో రెండు కోణాల్లో కనిపిస్తాడు . ఒకటి నార్మల్ గా, రెండోది “గే” గా. కానీ ఏ కోణంలోనూ నటనను పూర్తిగా అన్వయించుకునే తరహా సన్నివేశాలు కనిపించలేదు. కథపరంగా బావున్నా క్యారెక్టర్ ని డిజైన్ చేయడం లో శ్రీనివాస చక్రవర్తి విఫలమయ్యాడనే చెప్పాలి. ఇంక మిగిలిన నటుల విషయానికి వస్తే శివాజీ రాజా నటన కొంచెం ఎక్కువైందని అనిపిస్తుంది. హీరోయిన్లు ఇద్దరున్నా వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత లేదు. యామిని భాస్కర్ ఓ పాటలో అందాలను ఆరబోసేసింది. కానీ నటన పరంగా ఆమెకు ప్రాధాన్యత దక్కలేదు. రాయుడుగా చేసిన జయప్రకాశ్ నారాయణ్ లో విలనిజాన్ని అస్సలు బయటపెట్టనియ్యకుండా కేవలం కామెడీని పండించడంలో దృష్టిపెట్టారు. రాకెట్ రాఘవ తాగి మాట్లాడే సంభాషణ, జయప్రకాష్ రాయలసీమ యాస ప్రేక్షకులను నవ్విస్తాయ్.

ప్లస్ పాయింట్స్ :

కామెడీ టైమింగ్ చక్కగా ఉంది,
విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది,
నిర్మాణ విలువలు బావున్నాయి.

మైనస్ పాయింట్స్ :
నాగశౌర్య క్యారెక్టర్ డిజైన్,
పేలని ఎమోషన్ సీన్స్ ,
సో సో అనిపించే సంగీతం.

స్పష్టంగా చెప్పాలంటే సరదాగా నవ్వుకోవడం కోసం స్నేహితులతో కలిసి సినిమాకి వెళ్లొచ్చు.

సినిమా పేరు: @ నర్తనశాల
విడుదల తేదీ: 30/08/2018
రేటింగ్: 2.5/5
నటీనటులు: నాగ‌శౌర్య‌, క‌శ్మీర ప‌ర‌దేశి, యామినీ భాస్క‌ర్‌, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, అజ‌య్‌, శివాజి రాజా, సుధ‌, ప్రియ‌, జెమిని సురేష్‌, రాకేట్ రాఘ‌వ‌, స‌త్యం రాజేష్‌, రాఘ‌వ‌, ఉత్తేజ్‌, తిరుప‌తి ప్ర‌కాష్‌, ప‌ద్మ జ‌యంతి, మాధురి త‌దిత‌రులు..
సంగీతం: మహతి స్వర సాగర్
నిర్మాతలు: ఉష ముల్పూరి
దర్శకత్వం: శ్రీనివాస్ చక్రవర్తి.

        రేటింగ్: 2/5

- Advertisement -