ఆ రథంలోనే అంతిమయాత్ర…

201
Hari Krishna's Funeral Ceremony
- Advertisement -

హరికృష్ణ కోసం చైతన్య రథం మరోసారి సిద్దమవుతోంది. రోడ్‌ యాక్సిడెంట్‌ లో నేటి ఉదయం ప్రాణాలు కోల్పోయిన హరికృష్ణ అంతిమయాత్రకు ఈ వాహనాన్నే ఉపయోగించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. ప్రస్తుతం హైదరాబాద్‌ లోని నాచారంలో ఉన్న రామకృష్ణ స్టూడియోలో ఈ వాహనం ఉంది.

Hari Krishna's Funeral Ceremony

తెలుగుదేశం పార్టీని స్థాపించిన దివంగత నేత ఎన్టీఆర్‌ నిర్వహించిన చైతన్య యాత్రలో ఈ రథాన్ని ఉపయోగించారు. కాగా..ఆ యాత్రలో హరికృష్ణ పాత్ర అత్యంత కీలకమైంది. 72వేల కిలోమీటర్ల ఆ యాత్రకు ఆయన సారథిగా వ్యవహరించారు. యాత్ర పూర్తయ్యేంత వరకు తండ్రినే వెన్నంటి ఉన్నారు. ఈ చైతన్య రథమే ఎన్టీఆర్ ను అసెంబ్లీకి పంపింది. ఆయనను ముఖ్యమంత్రిని చేసింది. అయితే… ఈ చైతన్యరథంతో హరికృష్ణది ప్రత్యేకమైన అనుబంధం ఉన్నందున అంతిమయాత్రకు ఈ వాహనాన్నే ఉపయోగించనున్నారు.

- Advertisement -