హరికృష్ణ మృతి పట్ల టాలీవుడ్‌ హీరోల ట్వీట్స్‌..

301
tollywood heros
- Advertisement -

నందమూరి హరికృష్ణ మృతితో తెలుగు సినీ పరిశ్రమం శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు ఇప్పటికే సోషల్‌ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. తాజాగా హరికృష్ణ మృతిపై టాలీవుడ్ హీరోలు రామ్ చరణ్, ప్రభాస్, విజయ్ దేవరకొండ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

హరికృష్ణ హఠాన్మరణం చెందారన్న వార్త తెలిసి షాకయ్యానని, తీవ్ర విషాదానికి గురిచేసిందని, హరికృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని ఈమేరకు ట్వీట్లు చేశారు. తారక్, కల్యాణ్ రామ్, నందమూరి కుటుంబానికి తన సానుభూతి తెలుపుతున్నానని ప్రభాస్; తారక్ అన్నకు, నందమూరి కుటుంబానికి తీరని నష్టం జరిగిందని హీరో విజయ్ దేవరకొండ తన సంతాపం తెలిపాడు.

కాగా..ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కూడా ట్వీట్‌ చేస్తూ.. హరికృష్ణ మృతి వ్యక్తి గతంగా తీరనిలోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ ద్వారా తెలిపారు.

 

- Advertisement -