- Advertisement -
రక్షాబంధన్ పండగను పురస్కరించుకొని రాజ్యసభ సభ్యుడు, టీన్యూస్ ఎండీ జోగినపల్లి సంతోష్ కుమార్‌కు రాఖీ కట్టారు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. సంతోష్ నుదట బొట్టు పెట్టిన కవితను ఆశీర్వదించారు.
సోదర సోదరీ మణుల అప్యాయతకు ప్రతీకగా నిలిచే రాఖీపౌర్ణమి సందర్భంగా ప్రతి సంవత్సరం కవిత తన సోదరుడు మంత్రి కేటీఆర్‌తో పాటు ఎంపీ సంతోష్ కుమార్‌కు కూడా రాఖీ కడుతున్నారు.
అనురాగ బంధాల్ని, ప్రేమానురాగాల్ని బలోపేతం చేసే అపురూప పర్వదినం రాఖీ పౌర్ణమి. శ్రావణ మాసంలో వచ్చే శుభకర వేడుకల్లో, రక్షాబంధనం రమణీయం. నిండు పున్నమివేళ సిరివెన్నెల కురిసే శ్రావణ పూర్ణిమనాడు, ఈ బంధనంలో మమతల మధురిమలు వెల్లివిరుస్తాయి. సామరస్య సంతోషాలు సోదర సోదరీమణుల మధ్య వ్యక్తమవుతాయి. సోదరులు క్షేమంగా ఉండాలని ఆక్షాంక్షిస్తూ ఆడపడుచులు రాఖీని కడుతారు.
- Advertisement -