“పెళ్లి సందడి” కాపీయే “గీత గోవిందం” -రాఘవేంద్రరావు..!

344
- Advertisement -

తెలుగు సినీ ఇండస్ట్రీ లో ప్రస్తుతం ఎక్కడ చూసినా గీత గోవిందం సినిమా కబుర్లే. ప్రముఖ నటీనటులు ,సినీ ప్రముఖుల ప్రశంసల వర్షంలో గీత, గోవిందులతో పాటు చిత్ర బృందం మొత్తం తడిచి ముద్దైపోతున్నారనే చెప్పాలి. ఇటీవల జరిగిన 16వ సంతోషం సౌత్ ఇండియా ఫిలిం ఫేర్ అవార్డు ఫంక్షన్ లో కూడా ప్రముఖులనోట బాగా నానింది గీత గోవిందం. ఆ ప్రముఖులలో ఒకరైన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు గారు కూడా ఈ సినిమాని తన శైలి లో ప్రశంసించారు.

Geetha Govindam is a copy of my film - K. Raghavendhra rao..

‘‘20 ఏళ్ల క్రితం నేను, అర‌వింద్ క‌ల‌సి ‘పెళ్లి సంద‌డి’ సినిమా తీశాం. మ‌ళ్లీ ‘గీత‌ గోవిందం’ ఆ సినిమాను గుర్తు చేసింది. పరశురాం(బుజ్జీ) నా సినిమాను కాపీ కొట్టాడనే చెప్పాలి. అయినా ఒక్క ముద్దు కూడా లేకుండా సినిమా చేయ‌డం అంటే చాలా క‌ష్టం. నిర్మాత‌ల ద‌గ్గ‌ర నుంచి చాలా ఒత్తిళ్లు వస్తూ ఉంటాయి. అవి బుజ్జీ కూడా ఫేస్ చేసి ఉంటాడు. రాజీప‌డ‌కుండా మంచి సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది’’ అని దర్శకుడిని మెచ్చుకున్నారు రాఘవేంద్రరావు గారు.

Geetha Govindam is a copy of my film - K. Raghavendhra rao..

రాఘవేంద్ర రావు గారు చతురతతో అన్న మాటలు కొందరు పట్టించుకోకపోయినా సోషల్ మీడియాలో మాత్రం చర్చనీయాంశమయ్యాయి. అసలు పెళ్లి సందడికి ,గీత గోవిందం కథకి ఏంటి సంబంధం ? ఈ సినిమా విజయానికి తన సినిమాని గుర్తు చేసుకోవడమేంటని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఏది ఎలా ఉన్నా గొప్ప దర్శకేంద్రుడిగా పేరున్న రాఘవేంద్రరావు గారే గీత గోవిందం తో తన సినిమాని పోల్చుకోవడం గీత గోవిందం యొక్క ఖ్యాతిని రుజువు చేస్తుందని విజయ్ అభిమానులు సంబరపడిపోతున్నారు.

- Advertisement -