ఎప్పుడూ ఏదో ఒక విమర్శతో వార్తల్లోకెక్కే జీ.వీ.ఎల్ నరసింహారావు గారు ఈ సారి విభిన్నమైన వార్తతో చర్చల్లోకొచ్చారు. రాజ్య సభ సభ్యులుగా , భారత జనతా పార్టీ అభ్యర్థిగా ఆయనకు గుర్తింపున్నా. ప్రజా సంక్షేమం గురించి పట్టించుకోడన్న విమర్శలే ఆయనకు ఎక్కువ గుర్తింపునిచ్చాయి. ఇదిలా ఉంటే నిన్న జరిగిన ఓ సంఘటనతో ఆయన మళ్ళీ వార్తల్లోకెక్కి తీవ్ర విమర్శలకు గురవుతున్నారు.
గుంటూరు జిల్లాలో పర్యటన సందర్భంగా హైవే పై వాయు వేగంతో వెళ్తున్న ఆయన కారు రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలని ఢీ కొట్టింది. కాగా ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు విడువగా,మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతుంది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేయగా. యాక్సిడెంట్ జరిగిన వెంటనే జీ.వీ.ఎల్ అక్కడినుంచి వేరే కారులో వెళ్ళిపోయినట్టు స్థానికులు వివరించారు. యాక్సిడెంట్ చేసిన జీ.వీ.ఎల్ కార్ డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేసి తాడేపల్లి స్టేషన్ కు తరలించారు. కాగా ఈ విషయం ఫై జీ.వీ.ఎల్ ఏ మాత్రం నోరు విప్పకపోగా. కనీసం తనవల్ల ప్రాణాలు పోగొట్టుకున్న వారి కుటుంబాన్ని కూడా పరామర్శించకపోవడం స్థానికులను, అక్కడి నాయకులను ఆగ్రహానికి గురిచేస్తుంది.