రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా 241 పరుగులకుకుప్పకూలింది. దీంతో న్యూజీలాండ్ 2-2 సిరీస్‌ను సమం చేసింది. తొలుత ఫీల్డింగులో టీమిండియా బౌలర్లు కివీస్ బ్యాట్స్ మన్ ను 260 పరుగులకు కట్టడి చేశారు. అనంతరం 261 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా కేవలం 19 పరుగులకే రోహిత్ శర్మ (11) వికెట్ కోల్పోగా, విరాట్ కోహ్లీ (45) విఫలమయ్యాడు. అనంతరం రహానే (57) కీలక సమయంలో అవుటయ్యాడు. అనంతరం కెప్టెన్ ధోనీ (11) నీషమ్ వేసిన అద్భుతమైన బంతికి పెవిలియన్ చేరాడు.
ఈ దశలో అక్షర్ పటేల్ కు జత కలిసిన మనీష్ పాండే (12) కొట్టిన షాట్ ను న్యూజిలాండ్ ఆటగాడు లాంథమ్ అద్భుతంగా క్యాచ్ పట్టడంతో మనీష్ వెనుదిరిగాడు. తరువాతి కేదార్ జాదవ్ (0) డకౌట్ అయ్యాడు. హార్డిక్ పాండ్య (3) కూడా వెనుదిరిగాడు. దీంతో అక్షర్ పటేల్ (38) కు మిశ్రా(14) తోడవడంతో స్కోరు 200 దాటింది. అయితే 207 పరుగుల వద్ద అమిత్ మిశ్రా రనౌట్ అయ్యాడు. ఆ తరువాత అక్సర్ పటేల్ కూడా బౌల్ట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కులకర్ణి(25) ఉమేష్ యాదవ్‌తో కలిసి స్కోరును 241 పరుగులకు తీసుకెళ్లాడు. ఉమేష్ బౌల్ట్ బౌలింగ్ ఔటవడంతో టీమిండియా 241 పరుగులకు ఆలౌటయ్యింది. టీమిండియా టాపార్డర్ పతనాన్ని మూడు వికెట్లతో టిమ్ సౌతీ శాసించగా, నషీమ్ రెండు వికెట్లు.. బౌల్ట్ రెండు వికెట్లు తీసుకున్నారు.