కేరళ బాధితులకు విద్యుత్ శాఖ ఉద్యోగుల సాయం..

242
minister Jagdish Reddy
- Advertisement -

కేరళ వరద బాధితుల సహాయార్ధం ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి ప్రకటించారు. మంగళవారం సచివాలయంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు ఒక రోజు వేతనం 9కోట్ల రూపాయలను సీఎండీ ప్రభాకర్ నేతృత్వంలో మంత్రి జగదీష్ రెడ్డికి అందజేశారు. ప్రకృతి బీభత్సంతో కేరళ రాష్ట్రం అతలాకుతలం అయినందున, దేశం అంతా కేరళకి అండగా ఉండాలని మంత్రి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 25 కోట్ల రూపాయలతో పాటు బియ్యం అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు.

minister Jagdish Reddy

వారికి మనోధైర్యం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం అన్నారు. దేశంలో ఎవరికి ఇబ్బంది, కష్టాలు వచ్చిన ఆదుకునే వారు ఉన్నారనే ద్యైర్యం వారిలో కల్పించాలని ఆయన సూచించారు. కేరళ ప్రజలు వెంట మేము ఉన్నామని వారు భయపడే పని లేదని ఆయన తెలిపారు. కేరళకు విద్యుత్ స్థంబాలు, కరెంటు మీటర్లు, ఇతర విద్యుత్ పరికరాలు కూడా పంపుతున్నామని ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.

- Advertisement -