నిన్నటి వరకూ సోషల్ మీడియాలో ప్రియాంక, నిక్ జోనాస్ ల పై పుకార్లు షికార్లు చేశాయి. ఆ పుకార్లంతా..వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ గురించే. ఇప్పటికే అమెరికాలో ప్రియాంకచోప్రా, నిక్ జోనాస్ ల ఎంగేజ్మెంట్ జరిగిందనే వార్తలకు ఈ రోజుతో పుల్ స్టాప్‌పడింది.
ఇప్పటివరకూ వీరిపై వస్తున్న వార్తల నేపథ్యంలో మరో మారు హిందూ సాంప్రదాయం ప్రకారం ఇండియాలో ఇరు కుటుంబాల మధ్య ప్రియా,నిక్ లు అధికారికంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. దీనిలో బాగంగానే ఈ రోజు ఉదయం పది గంటల ప్రాంతంలో ప్రియాంక ఇంట్లో పూజలు నిర్వహించారు. అంతేకాదు ఈ రోజు సాయంత్రం ముంబైలోని ఓ ఫైస్టార్ హోటల్ లో ప్రియాంక తన కుటుంబసభ్యులకు, స్నేహితులకు ఎంగేజ్‌మెంట్ పార్టీ కూడా ఇస్తోంది.
ఇక ఈ వేడుకలో పాల్గొనేందుకు జోనాస్ తల్లిదండ్రులు ముంబై చేరుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ట్విటర్ యూజర్ల నుంచి ప్రియాంక-నిక్ జోనాస్‌లకు నిశ్చితార్థపు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.