నాకు మా ఆయన కావాలి….

303
- Advertisement -

తెలుగు, తమిళం,కన్నడ సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన సీనియర్‌ నటి రంభ ఫ్యామిలీ గొడవలతో సందిగ్ధంలో పడింది. రంభ 2010 ఏప్రిల్ లో కెనడాకు చెందిన ఇందిరన్ పద్మనాభన్ ను వివాహం చేసుకుంది. కొన్నాళ్లపాటు భర్తతో కలిసి టోరంటోలో కాపురం పెట్టింది.

online news portal

వీరికి ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఆరేళ్లపాటు హాయిగా సాగిన వీళ్ల సంసారంలో ఇటీవల గొడవలు మొదలైయ్యాయి. ఈ క్రమంలోనే కెనడా నుంచి చెన్నై వచ్చిన రంభ… కొన్ని నెలల నుంచి భర్తకు దూరంగా ఉంటుంది…దీంతో రంభ భర్త పద్మనాభన్‌ విడాకులు కోరుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే రంభ మాత్రం విడాకులు వద్దని చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి ఓ పిటీషన్‌ను దాఖలు చేసింది. ఆ పిటీషన్‌లో తాను తన భర్తతో కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.

హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 9ప్రకారం తనకు హక్కులు కల్పించాలని కోరింది రంభ. తనకు విడాకులు వద్దని… భర్తతో కలిసి ఉండేందుకు అవకాశం కల్పించాలని కోర్టులో విజ్ణప్తి చేసింది. డిసెంబర్‌ 3వ తేదిన నటి రంభ కేసు విచారణకు రానుంది.

online news portal

ఇటీవలే కాలంలో విడాకులు కోరుతూ సెలబ్రీటీలు కోర్టుల చుట్టూ క్యూ కడుతున్నారు. దక్షిణాది హీరోయిన్‌ అమలాపాల్‌, దర్శకుడు విజయ్‌ల ప్రేమ పెళ్లి పెటాకులైన సంగతి మనకు తెలిసిందే. విజయ్‌ దర్శకత్వం వహించిన సినిమాల్లో అమలాపాల్‌ హీరోయినగా నటించడం, ఇద్దరూ ప్రేమలో పడడం, పెద్దల అంగీకారంతో రెండేళ్ల క్రితం ఎంతో ఆర్భాటంగా వీరు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు కావాలని చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు.

online news portal

ఇక తమిళ సూపర్‌స్టార్‌ రజినీ కాంత్‌ కుమార్తె సౌందర్య కూడా విడాకుల లిస్ట్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఆరేళ్ల కిందట చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త అశ్విన్‌కుమార్‌ను సౌందర్య ప్రేమించి పెళ్లి చేసుకుంది. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో విడాకులు కోరుతూ సౌందర్య చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారం రజినీకాంత్‌కు మనశాంతి లేకుండా చేస్తోంది. వృత్తిపరంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇద్దరు కుమార్తెల కారణంగా రజినీకాంత్ నిత్యం వార్తలకెక్కాల్సి వస్తోంది. రజినీ మరో కుమార్తె ఐశ్వర్య ధనుష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే.

online news portal

ప్రస్తుతం పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్లు విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతుంటే.. రంభ మాత్రం తనకు విడాకులు వద్దంటూ కోర్టు మెట్లెక్కడం సినీ వర్గాల్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

- Advertisement -