లార్డ్స్‌లో కోహ్లీ సేన తడ’బ్యాటు’

217
kohli
- Advertisement -

ఓ వైపు వాన…తొలి రోజు ఆట వర్షార్పణం. రెండోరోజైనా ఆటసాగుతుందా అనే అనుమానాలు అందరిలో నెలకొన్నాయి. ఎట్టకేలకు ఆట మొదలైంది. మూడు గంటలు మాత్రమే ఆటసాగగా భారత్ బ్యాట్స్ మెన్ తీవ్ర నిరాశ పర్చారు. కేవలం 35.2 ఓవర్లలో 107 పరుగులకే చాపచుట్టేసింది కోహ్లీ సేన.

ఎడ్జ్‌బాస్టన్‌ ఓటమి నుంచి భారత బ్యాట్స్‌మెన్‌ పాఠాలు నేర్వలేదు. లార్డ్స్‌లోనూ సేమ్ సీన్ రిపీట్. పేలవ ప్రదర్శనతో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఒక్కరొక్కరిగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (23; 70 బంతుల్లో 2×4) పోరాడినా గట్టెక్కించలేకపోయాడే. చివర్లో రహానె (18; 44 బంతుల్లో 2×4) ,అశ్విన్‌ (29; 49 బంతుల్లో 4×4) పుణ్యమా భారత్ స్కోరు వంద దాటింది.

 England vs India

ఇంగ్లాండ్ బౌలర్లో జేమ్స్‌ అండర్సన్‌ (5/20) భారత్‌ పతనాన్ని శాసించాడు. మూడో రోజు భారత బౌలర్లూ విజృంభిస్తే తప్ప భారత్‌ ఓటమి తప్పించుకోవడానికి వరుణుడిని నమ్ముకోవాల్సిందే.

- Advertisement -