టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై తీవ్ర దుమారం రేపింది నటి శ్రీరెడ్డి. టాలీవుడ్ లోని పలువురు ప్రముఖులను టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా పలు కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. శ్రీరెడ్డి చేసిన ఆరోపణల్లో రుజువు లేకపోవడంతో ఆమె చేసిన పోరాటం వృధా అయిపోయింది. టాలీవుడ్ లో హీరో నాని, దగ్గుబాటీ అభిరామ్, వైవా హర్ష ఇలా పలువురి మీద శ్రీరెడ్డి కామెంట్లు చేసింది. ఇక తాజాగా శ్రీరెడ్డి టాలీవుడ్ ని వదిలి కోలీవుడ్ లోని పలువురు డైరెక్టర్లు, హీరోలపైనా కూడా కామెంట్లు చేస్తుంది.
దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు, దర్శకుడు వారాహి శ్రీరెడ్డిపై పోలీస్ కేసు కూడా నమోదు చేశాడు. కోలీవుడ్ లో దర్శకుడు మురుగదాస్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ఇలా పలువురిపై కామెంట్లు చేసింది. అయితే శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై డ్యాన్స్ మాస్టర్ , హీరో లారెన్స్ స్పందించాడు. శ్రీరెడ్డి నాపై చేసిన ఆరోపణల గురించి చాలా మంది నన్ను అడుగుతున్నారు..కొంత మంది ఫోన్లు, మెసెజ్ లు చేస్తున్నారని చెప్పారు. ఇంతటితో ఈవివాదానికి ముగింపు పలకాలని అనుకుంటున్నానని తెలిపారు.
శ్రీరెడ్డి నాపై చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదన్నారు. రెబల్ సినిమా షూటింగ్ సమయంలో శ్రీరెడ్డి నన్ను కలిసిందని..ఆమూవీ వచ్చి దాదాపు 7సంవత్సరాలు గడిస్తే ఇంతవరకూ ఆమె ఎందుకు ఫిర్యాదు చేయలేదన్నారు. అయినా హోటల్లోని రూమ్ లో దేవుళ్ల ఫోటోలు, రుద్రాక్ష మాలలు పెట్టుకోవడానికి నేను ఏమయినా పిచ్చివాడినా అంటూ ప్రశ్నించాడు. శ్రీరెడ్డి తన టాలెంట్ ను నిరూపించుకునే అవకాశం ఇవ్వడానికి తాను సిద్దంగా ఉన్నానని చెప్పారు. శ్రీరెడ్డి పట్ల నేను జాలి పడుతున్నానే గానీ…ఆమెకు భయపడటం లేదన్నారు. ఇక లారెన్స్ చేసిన వ్యాఖ్యలపై శ్రీరెడ్డి ఏవిధంగా స్పందిస్తుందో వేచిచూడాలి.