నిశ్చితార్థంపై క్లారిటీ ఇచ్చిన తాప్సీ..!

203

టాలీవుడ్‌లో అడుపెట్టి టాప్ హీరోయిన్‌ స్థాయికి చెరుకున్న హీరోయిన్ తాప్సీ. అయితే ఈ అమ్మడికి టాలీవుడ్, కోలీవుడ్‌లలో అవకాశాలు తగ్గాయి. కానీ బాలీవుడ్‌లో అవకాశాలు బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఆమె సక్సెస్ ఫుల్ నటిగా రాణిస్తోంది. మరోవైపు ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెలుచుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మాథ్యూస్‌తో ఆమె ప్రేమాయణం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ముంబైలోని ఓ స్టార్ హోటల్ నుంచి వీరిద్దరూ చేయిచేయి కలుపుకుని బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈమె పై సోషల్ మీడియాలో కొన్ని వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

Taapsee Pannu

ఇప్పుడు వీరిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. గోవాలో తాప్సీ కుటుంబసభ్యుల సమక్షంలో ఈ నిశ్చితార్థం నిరాడంబరంగా, సీక్రెట్ గా జరిగిందని సమాచారం. అయితే తాజా ఈ వార్త ఆ నోట ఈ నోట పాకి తాప్సీ చెవిన పడడంతో.. తాప్సీ ఈ విషయంపై ట్విటర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది.

సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలో ఎటు వంటి నిజంలేదని.. తాప్సీకి నిశ్చితార్థం అయ్యింది అంటూ వచ్చే వార్తలన్నీ వట్టి పుకార్లని ఆమె చెప్పుకొచ్చారు. అంటే తాప్సీ కి నిశ్చితార్థం జరిగింది అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదనమాట. ప్రస్తుతం తాప్సీ నటించిన “ముల్క్‌” అనే హిందీ చిత్రం విడుదలకు సిద్ధమౌతుండగా.. అలగే ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్న “నీవెవరో” సినిమాలో నటిస్తు బిజీగా వుంది.