తెలుగు చిత్ర సీమలో కొత్త దర్శకులు తమదైన టేకింగ్‌తో ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారు. గతేడాది ‘అర్జున్ రెడ్డి’తో సందీప్ వంగ మ్యాజిక్ చేయగా తాజాగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి ‘ఆర్‌ఎక్స్ 100’ చిత్రంతో ఇండస్ట్రిని షేక్ చేశారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఆర్‌ఎక్స్ 100 రయ్ మంటూ చక్కటి వసూళ్లతో దూసుకుపోతుంది. అజయ్ భూపతి టేకింగ్‌పై విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు లభిస్తున్నాయి.
ఈ క్రమంలో ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన అజయ్ భూపతి తన గురువు ఆర్జీవీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్జీవీని మించిన టెక్నిషియన్ ఈ భారతదేశంలో లేరని కానీ పర్సనల్‌గా ఆయనంత నీచుడు లేడన్నారు. అవతలి వ్యక్తిని టార్గెట్ చేస్తూ కామెంట్ చేయడం నచ్చదన్నారు. ఆయన కామెంట్లు చేసిన ప్రతీసారి ఓ ఆలోచన వచ్చేదని…ఆయన్ని కిడ్నాప్ చేసి కాళ్లు చేతులు కట్టేసి కళ్లు రెప్ప ఆర్పకుండా మంచి ఫ్యామిలీ డ్రామా సినిమాలు వారం రోజుల పాటు చూపించాలన్నారు. ఆయనకు అదే శిక్ష అన్నారు. బయోపిక్‌లు అంటూ తీస్తే ఆర్జీవీ బయోపిక్ మాత్రమే తీస్తానని తెలిపారు.
ఐదేళ్ల క్రితం ఓ సంఘటన వల్ల చాలా మానసిక వేదనకు గురయ్యాను. ఆత్మహత్య చేసుకోవాలన్నది వాస్తవం కాదన్నారు. నా వద్ద ఉన్న కథలను పక్కన పెట్టి ఆర్‌ఎక్స్ 100 సినిమా కథ రాశానని తెలిపారు.