యూట్యూబ్‏ని ఫాలో అయి.. ప్రాణాలు కోల్పోయిన యువతి..

238
Krithiga_pregnant_tirupur
- Advertisement -

ప్రస్తుతం పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ సోషల్ మీడియాను ఫాలోఅవుతున్నారు. అందులో చాలా మంది యూ ట్యూబ్ వీడియోలు చూస్తూ వంట చేయడం, వస్తువులు తయారు చేసే వీడియోలను చూస్తూ… నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే తమిళనాడుకు చెందిన ఓ జంట యూ ట్యూబ్ వీడియోల సూచనల ప్రకారం ప్రసవానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఈ ఘటనలో భార్య బిడ్డకు జన్మనిచ్చి చనిపోయింది.

 home birth

వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరుపూర్ ప్రాంతంలో కృతిక(28) ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తోంది. ఈమె భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఈ ఇద్దరు దంపతులు యూ ట్యూబ్ ని ఫాలో అవుతుంటారు. కృతిక ప్రెగ్నెన్సీతో ఉండడంతో కొన్ని రోజుల నుంచి యూట్యూబ్ లో ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వీడియోలలోని సూచనలు పాటిస్తూ.. వచ్చారు.

ఇక యూ ట్యూబ్ వీడియోల సూచనల ప్రకారం ఇంట్లోనే బిడ్డకు జన్మనివ్వాలని దంపతులు భావించారు. నెలలు నిండిన తరువాత నొప్పులు ప్రారంభకావడంతో వీడియోలలోని సూచనల ప్రకారం ప్రసవానికి ప్రయత్నించారు. వీరు చేసిన ప్రయత్నం విఫలమయింది. బిడ్డకు జన్మనిచ్చింది కానీ.. ఆమెకు తీవ్ర రక్తస్రావం అయింది.

భయంతో భర్త వెంటనే బార్యను ఆస్పత్రికి తీసుకెళ్లాడు కానీ ఫలితం లేకుండా పోయింది. తీవ్ర రక్తస్రావంతో కృతిక చనిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు. భార్య స్నేహితురాలు సహజ ప్రసవాలు చేస్తుండేదని.. ఆమె సూచనల మేరకు ఈ పని చేశానని కృతిక భర్త పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ దంతలకు మూడేళ్ల పాప కూడా ఉంది. 

- Advertisement -