బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు క్రికెట్‌కు దూరమైన ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) టీ20లో సత్తాచాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ఆగస్టు 8 నుంచి ప్రారంభం కానున్న సీపీఎల్ టోర్నీలో బార్బడోస్ ట్రైడెంట్స్ తరపున స్మిత్ బరిలోకి దిగనున్నాడు.
స్మిత్ రాకతో బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్టంగా మారిందని టాప్ ప్లేయర్ జట్టులోకి రావడం ఆనందంగా ఉందన్నారు కోచ్ రాబిన్ సింగ్. బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ సీపీఎల్ నుంచి తప్పుకోవడంతో ఆ జట్టు యాజమాన్యం స్మిత్‌కు చోటు కల్పించింది. ట్రిడెంట్స్ జట్టు విజయాల్లో స్మిత్ కీలక పాత్ర పోషిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు ఆ జట్టు కోచ్.
ఈ టోర్నీ కంటే ముందు గ్లోబల్ టీ20(కెనడా) లీగ్ ఆడిన స్మిత్ తన మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. టొరంటో నేషనల్స్ ప్రాతినిధ్యం వహించిన స్మిత్ 33.40 యావరేజ్‌తో ఆరు ఇన్నింగ్స్లో 167 పరుగులు చేశాడు. ఇందులో రెండ్ హాఫ్ సెంచరీలు ఉన్నాయి.