ఈ నెల 27న ఆకాశంలో అద్భుతం జరగనుంది. గత వంద సంవత్సరాలుగా ఎప్పుడూ చూడని సుదీర్ఘ బ్లడ్ మూన్ దర్శనమివ్వనుంది. దాదాపు 43 నిమిషాల పాటు కనువిందు చేయనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహణం భారతదేశంతో పాటు దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియాలో కనిపించనుంది.
భారతదేశ కాలమాన ప్రకారం 27న రాత్రి 11 గంటలు 54 నిమిషాలకు ప్రారంభం కానుంది. అయితే గ్రహనం సందర్భంగా లేనిపోని అనుమానాలు,అపోహలను నమ్మవద్దని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భవతులు ఎలాంటి భయందోళన చెందాల్సిన పనిలేదన్నారు.
సంపూర్ణ స్థితికి గ్రహణం రాక : రాత్రి 01గంటలు 00 నిమిషాలు
చంద్ర గ్రహణ మధ్యకాలం : రాత్రి 01గంటలు 52 నిమిషాలు
సంపూర్ణ స్థితి నుండి విడుపు ప్రారంభం : రాత్రి 02 గంటలు 43 నిమిషాలు
చంద్ర గ్రహణ ముగింపు: రాత్రి 03 గంటలు 49 నిమిషాలు
అద్యంత పుణ్యకాలం : 3 గంటల 55 నిమిషాలు అంటే మొత్తంగా ఈ ప్రక్రియ పూర్తవడానికి ఆరు గంటల 14 నిమిషాల సమయం పట్టనుంది.