అర్జున్ రెడ్డి అవార్డును సొంతం చేసుకున్న దివీస్..

208
vijay devarakonda Filim fare avard
- Advertisement -

అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నెట్ స్టార్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. ఆ సినిమాలో ఆయన నటనకు ఫిలిం ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు. ఆ అవార్డును సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇస్తానని ఫిలిం ఫేర్ అవార్డ్ ఫంక్షన్ లోనే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఫిలిం ఫేర్ అవార్డును దివీస్ లేబొరేటరీ సంస్థ సొంతం చేసుకుంది. రూ. 25 లక్షలు చెల్లించి ఈ వార్డును దక్కించుకున్నారు.

Rowdy Sundowner party

విజయ్ తన అభిమానుల కోసం సొంతంగా దుస్తుల బ్రాండ్ ను ‘రౌడీ క్లబ్’ పేరుతో నేడు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో అభిమానులు హాజరై సందడి చేశారు. ఈ కార్యక్రమంలోనే దివీస్ అధినేత కిరణ్ సతీమణి శకుంతల ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. రూ. 25 లక్షల చెక్కును విజయ్ దేవర కొండకు అందించారు. దివీస్ సంస్థ ఈ అవార్డును తీసుకోవడంతో విజయ్ కి వేలం వేసే పనిలేకుండా అమ్ముడు పోయింది. ఈ డబ్బును విజయ్ సీఎం రిలీఫ్ ఫండ్ ని అందజేయనున్నారు.

మరోవైపు విజయ్, అర్జున్ రెడ్డి సినిమా తరువాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. టాక్సీడ్రైవర్ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్దంగా ఉండగా.. నోటా, గీత గోవింది, వంటి చిత్రాలు చిత్రీకరణలో ఉన్నాయి. గీత గోవిందం నుంచి విడుదలైన, ‘ఇంకేం.. ఇంకేం కావాలే’ పాట యూత్ ని ఆకట్టుకుంటోంది. యూట్యూబ్ లో ఈ పాట ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

- Advertisement -