రాక్ లైన్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు చంద్ర సిద్దార్ధ తెరకెక్కించిన సినిమా ఆటగదరా శివ. రాక్ లైన్ వెంకటేశ్ ఈచిత్రాన్ని నిర్మాతగా వ్యవహరించారు. జులై 20వ తేదిన ఈసినిమా విడుదల చేయనున్నట్లు తెలిపారు. కన్నడలో సూపర్ హిట్ సాధించిన రామ రామ రే చిత్రాన్ని ఆధారంగా తీసుకుని ఈసినిమాను తెరకెక్కించారు. ఈసినిమాలో ఉదయ్ శంకర్ హీరోగా నటించగా..జబర్ధస్త్ ఫేమ్ హైపర్ ముఖ్య పాత్రలో పోషించారు. ఈసందర్భంగా ఈసినిమాలోని ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే అనే పాటను పవర్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..ఈసినిమా హీరో ఉదయ్ శంకర్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసని..వాళ్ల నాన్న శ్రీరామ్ గారు మా గురువవన్నారు. నేను నటించిన గోకులంలో సీత సినిమా నుండి ఉదయ్ నాకు పరిచయం అని చెప్పారు. డైరెక్టర్ చంద్రసిద్దార్ద గారు చేసిన ఆనలుగురు లాంటి సినిమాలు చాలా యూనిక్ గా ఉంటాయన్నారు. ఈసినిమా విజువల్స్ , మేకింగ్ చాలా కొత్తగా ఉన్నాయన్నారు. ఉదయ్ శంకర్ చాలా బాగా నటించారని చెప్పారు. ఈసినిమా తప్పకుండా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కొరుకుంటున్నానన్నారు పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ గారు ఇంత జిజీ షెడ్యూల్ లో కూడా మా సినిమాలోని పాటను విడుదల చేయడం మాకు చాలా హ్యాపిగా ఉందన్నారు హీరో ఉదయ్ శంకర్. నా డెబ్యూ మూవీలో పవన్ కళ్యాణ్ సాంగ్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈమూవీకి చైతన్య ప్రసాద్ మంచి సంగీతం అందించారన్నారు. ఈచిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన రాక్ లైన్ వెంకటేశ్ కు ధన్యవాదాలు తెలిపారు. డైరెక్టర్ చంద్ర సిధ్దార్ధ మంచి ఎమోషనల్ తో ఈసినిమాను తెరకెక్కించారన్నారు హీరో ఉదయ్ శంకర్.