కొత్త జంటను మండపానికి తీసుకువచ్చిన గద్ద.. వీడియో

210
bride-groom-entry-

పెళ్లంటే 100 ఏళ్ల జీవితం.. తనతో జీవితం పంచుకోవడానికి వస్తున్న భాగస్వామితో ఆ క్షణాలను జీవితాంతం గుర్తుండి పోయేలా ప్లాన్ చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో చాలా మంది తమ పెళ్లిలను వెరైటీగా చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవలె ఓ కొంత జంట జేసీబీలో కూర్చొని విహరించింది. తాజాగా మరో కొత్తజంట.. టెక్నాలజీతో మరికాస్త వెరైటీగా పెళ్లి మండపానికి వచ్చింది.

viral video of bride groom entry in wedding,

ఈ కొత్త దంపతులను ఓ గద్ద పెళ్లి మండపానికి ఆకాశంలో విహరిస్తూ తీసుకు వచ్చింది. ఓ ఎలట్రిక్ పంచారాన్ని ఏర్పాటు చేసి.. అందులో వధూవరులను పెళ్లి మండపానికి తీసుకుచ్చారు. విద్యుత్ కాంతులు విరజిమ్ముతూ.. ఈ కొత్త జంటను పెళ్లి మండపంలో క్రేన్ సాయంతో దించారు.  ఇక పెళ్లికి వచ్చిన అతిథులు ఈ వెరైటీని చూసి.. వాహ్.. బలే ఏర్పాటు చేశారే అని అనుకున్నారట.

నిజంగానే పజరంలో ఉన్న వదూవరులను గద్ద పెళ్లి మండపంలోకి తీసుకువచ్చినట్లు బలే ఏర్పాటు చేశారని చెబుకుంటున్నారట. అక్కడికి వచ్చిన అతిథులు వీడియో తీసి నెట్టింట్లో పెట్టగా.. అది కాస్త వైరల్ అవుతోంది. ఈ వెరైటీ పెళ్లి వీడియోకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మీరు ఈ వెరైటీ పెళ్లి మీడియోపై ఓ లుక్కెయ్యండి.