టాలీవుడ్ లో శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వెనుదుమారం రేపాయి. శేఖర్ కమ్ముల, దగ్గుబాటి అభిరామ్, కొరటాల శివ,కోన వెంకట్, వంటి ప్రముఖులపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు హీరో నానిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేయగా.. నాని కూడా ఆమెకు లీగల్ నోటీసులు పంపించాడు. శ్రీరెడ్డి కూడా కోర్టులో చూసుకుందాం అంటూ సవాల్ విసిరింది.
అయితే గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న శ్రీరెడ్డి, తాజాగా తమిళ సినీ ప్రముఖులపై ఆరోపణలు చేస్తూ వస్తోంది. తాజాగా సుకుమార్, రాఘవ లారెన్స్ లపై సంచలన వ్యాఖ్యలు చేసింది. రాఘవ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంది. ఓ వ్యక్తి ద్వారా సుకుమార్ ని ఓ హోటల్ లో కలిశానని, తన సినిమాలో అవకాశం ఇస్తానని మాటిచ్చి.. మర్చి పోయారని ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలపై అటు లారెన్స్ కానీ, సుకుమార్ కానీ స్పందించలేదు.
ఇప్పుడు మరో తమిళ హీరో విశాల్ పై సంచలన ఆరోపణలు చేసింది. తాను తమిళ దర్శకులపై, హీరోలపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో విశాల్ తనకు హానీ తలపెట్టే అవకాశం ఉందని ఆరోపించింది. ఎవరెంత ప్రయత్నించినా… తమిళ్ లీక్స్ ఆపనని చెప్పుకొచ్చింది. మరీ ఈ ఆరోపణలపై విశాల్ ఎలా స్పందిస్తాడో చూడాలి.