జపాన్‌కు వెళ్లనున్న మగధీర..?

240
- Advertisement -

దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా భారీ విజయాన్ని అందుకున్నా విషయం తెలిసిందే. భారతీయ సిని చరిత్రలో అత్యధిక వసుళ్లు రాబట్టిన మూవీగా రికార్డులకెక్కింది. అంతేకాదు దాదాపు భారతీ పలు భాషల్లో బాహుబలిని రిలీజ్ చేశారు. విడుదలైన అన్ని చోట్ల ప్రేక్షకుల ఆదరణ పొందింది. బాహుబలిని ఇతర దేశాల భాషలలో కూడా విడుదల చేశారు.

Magadheera

ప్రతి భాషలోనూ బాహుబలికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇటీవలే జపనీస్ భాషలోకి డబ్ చేసి విడుదల చేయగా అక్కడ కూడా అద్భుతమైన ఆదరణ లభించింది. ఇక బాహుబలికి జపాన్‌లో వచ్చిన ఆదరణను చూసి ఇప్పుడు మగధీర మూవీ మేకర్స్ కూడా ఇతర దేశాలలో విడుదల చేయలనే ఆలోచనలో ఉన్నటు సమాచారం.

2009లో రిలీజ్ అయిన ఈ మూవీకి కూడా రాజమౌళియే దర్శకుడు. అతనికి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇప్పుడు మగధీరని జపాన్‌లో చూపించడానికి నిర్మాతలు ఆసక్తితో ఉన్నట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సివుంది. రాంచరణ్, కాజల్ అగర్వాల్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రంలో దేవ్‌గిల్, శ్రీహరి కీలక పాత్రల్లో నటించారు.

- Advertisement -