ఎన్టీఆర్ మాటలే.. నన్నుఈ స్థాయికి చేర్చాయి..

250
Rajendraprasad and Senior NTR
- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను కిలిగింతలు పెట్టించారు కథానాయకుడు రాజేంద్రప్రసాద్. హాస్య కథానాయకుడిగా చిత్ర పరిశ్రమలో మంచి పేరు సంపాందించుకున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మొదటి సారిగా ఎన్టీఆర్ ని కలుసుకున్న సందర్భాన్ని గుర్తు చేశారు. నటనలో శిక్షణ తీసుకున్న నేను గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత ఎన్టీఆర్ వచ్చి అభినందించారని గుర్తు చేశారు.

Rajendraprasad

ఆ సమయంలో ఆయన ఎదురుగా కూర్చుకున్నానని, అప్పుడు ఆయన నాతో.. చూడు ప్రసాద్ సినిమా ఇండస్ట్రీలో నిలబడాలంటే ఒక విషయాన్ని నువ్వు ఫాలో అవ్వాలి. అది నీవు ఫాలో అవుతేనే నిలబడతావు లేకుంటే లేదు అన్నారు. పౌరాణిక వేషాలు అనగానే వెంటనే రామారావు అంటారు. రొమాంటిక్ చిత్రాలు అనగానే శోభన్ బాబు అంటారు. కుటుంబ కథ చిత్రాలు చేయడానికి నాగేశ్వరరావు ఉన్నారు. అలాగే నీవు దేనికి పనికొస్తావో చెప్పు? ఏ దానిలో ప్రత్యేక చూపించగలవని  అన్నారు. అంతే ఆయన అన్న ఆ ఒక్క మాటకి.. నాకు వారం రోజులు అన్నం తినాలనిపించలేదని చెప్పారు. ఆయన మాటలతోనే నన్ను కొత్తకోణంలోకి నడిపించాయని చెప్పుకొచ్చారు.

- Advertisement -