మహానటుడు, మాజీ సీఎం నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈసినిమాకు నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. అంతేకాకుండా తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో స్వయంగా తానే నటిస్తున్నాడు. ఈమూవీకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటివలే ఈచిత్ర షూటింగ్ ను కూడా ప్రారంభించారు. ఇక ఎన్టీఆర్ బయోపిక్ లో నటించే నటీనటుల పేర్లు అధికారికంగా ప్రకటించనకపోయినప్పటికి పలువురి పేర్లు వినిపిస్తున్నాయి.
ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ ప్రముఖ నటీ విద్యాబాలన్ ను తీసుకున్నట్లు తెలుస్తుంది. తాజాగా మరో విలక్షణ నటుడి పేరు కూడా వినిపిస్తుంది. ప్రకాశ్ రాజ్ కూడా ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తున్నట్లు తెలుస్తుంది. విజయ వాహిని స్టూడియో అధినేత నాగిరెడ్డి పాత్రలో ప్రకాశ్ రాజ్ చేయనున్నట్లు వార్లలు వస్తున్నాయి. ఎన్టీఆర్ జీవితంలో నాగిరెడ్డి కూడా కీలక పాత్ర పోషించాడు. దర్శకుడిగా, నిర్మాతగా ఎన్టీఆర్ తో పలు చిత్రాలు చిత్రికరించారు.
ఎన్టీఆర్ కెరీర్ లో చాలా సినిమాలు నాగిరెడ్డి తో తీశారు. వీరిద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉండేది. నాగిరెడ్డి పాత్రలో ప్రకాశ్ రాజ్ చేస్తున్న ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు చిత్రబృందం. ఎన్టీఆర్ జీవితంలో ప్రముఖ పాత్ర పోషించిన పలువురు సినీ, రాజకీయ నేతలందరి పాత్రలు ఎన్టీఆర్ బయోపిక్ లో ఉండనున్నాయి. మరో దర్శక నిర్మాత బీఏ సుబ్బారావు పాత్ర కూడా ఈసినిమాలో చూపించననున్నారు. ఆయన పాత్రలో సీనియర్ నటుడు నరేశ్ నటిస్తున్నాడు. ఈసినిమాను సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్.