తెలుగు చిత్రపరిశ్రమలో చేసింది మూడు సినిమాలే అయినా.. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పర్చుకున్నాడు నటుడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఆయన చేతిలో అరడజను పైగా సినిమాలు ఉన్నాయి. వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘టాక్సీవాలా’ చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. మరోవైపు గీత గోవిందం, నోటా సినిమాలు చిత్రీకరణలో ఉన్నాయి. ప్రస్తుతం నోటా సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది.
రాజకీయనేపథ్యంలో దర్శకుడు ఆనంద్ శంకర్ ఆసక్తిగా తెరకెక్కించనున్నారట. ఇక ఇందులో విజయ్ దేవర కొండ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. అర్జున్ రెడ్డి పాత్రలో యూత్ ని తనవైపు తిప్పుకున్న విజయ్.. ఇక సీఎం పాత్రలో ఎలా ఉండనున్నాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ మూవీలో సీఎం పాత్రలో నటించి భారీ విజయాన్ని అందుకున్నారు. మరి విజయ్ సీఎంగా నటిస్తున్న నోటా చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.