రాయల్ పోస్టర్‏తో నారా రోహిత్..

250
Veera-Bhoga-Vasantha-Rayalu-First-Look-Poster-
- Advertisement -

విజయ, అపజయాలను పట్టించుకోకుండా విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు నారా రోహిత్. వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ.. ఈ మధ్యకాలంలో ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేవు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘వీర భోగ వసంత రాయలు’ టైటిల్ పోస్టర్ ని నేడు విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. తలకిందులగా వేలాడ దీసిన స్టిల్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తోంది.

Veera-bhoga-vasantarayulu

ఇక సమ్మోహనం తో మంచి సక్సెస్ అందుకున్న యువ హీరో సుధీర్ బాబు, నీదీ నాదీ ఒకే కథతో ప్రేక్షకులను మెప్పించిన శ్రీవిష్ణు కూడా ఇందులో నటిస్తున్నారు. వీరితో పాటు మరో ప్రధానమైన పాత్రలో స్టార్ హీరోయిన్ శ్రియ కనిపించనున్నారు. ఇక విభిన్న కథలతో ఆకట్టుకునే ఈ ముగ్గురు హీరోలు ఒకే సినిమాలో కనిపించనున్నారంటే.. ఈ సినిమాలో ఖచ్చితంగా మంచి థ్రిల్ ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారట. ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా ఈ యువ హీరోలు థ్రిల్ చేయనున్నారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

- Advertisement -