హీరో వెంకటేష్ గురించి తాజగా ఓ ఇంటర్వ్యూలో భానుప్రియ చాలా విషయాలు రివీల్ చేసింది. శ్రీనివాస కల్యాణం, స్వర్ణకమలం లాంటి క్లాసిక్ చిత్రాల్లో ఈ జోడీ కలిసి నటించింది. ఈ రెండు సినిమాలు అప్పట్లో మంచి విజయాన్ని నమోదు చేశాయి. స్వర్ణకమలం మూవీతో వెంకీ, భానుప్రియలకు మంచి పేరు కూడా వచ్చింది. అయితే అప్పట్లో వెంకటేష్, భానుప్రియ జోడి సెట్లో ఎలా ఉండేవాళ్లు? వెంకీకి భానుప్రియకు మధ్య జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏంటి? తెలుసుకోవాలంటే.. భానుప్రియ చెప్పిన ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలపై మీరూ ఓ లుక్కేయండి.
వెంకటేష్ కెరియర్ లో మైలురాయిగా నిలిచిన చిత్రం స్వర్ణకమలం. శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టంలేని అమ్మాయిగా భానుప్రియ, తనకు ఆ కళపై ఇంట్రెస్ట్ కలిగేలా చేసే కుర్రాడిగా వెంకీ పాత్రల్లో ఒదిగిపోయారు. స్వర్ణకమలం రిలీజైన తరువాత ఎంతోమంది శాస్త్రీయనృత్యం నేర్చుకోవడానికి ఆసక్తి చూపించారంటే.. కె. విశ్వనాథ్ సినిమాను ఎంతబాగా తెరకెక్కించారో అర్థం చేసుకోవచ్చు.
ఈ సినిమా కోసం వెంకటేష్ కూడా శాస్త్రీయ నృత్యం నేర్చుకున్నాడు. వెంకీకి శాస్త్రీయ నృత్యం నేర్పించింది భానుప్రియ అత్తమ్మట. తాజాగా ఈ విషయాన్నింటిని భానుప్రియ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అంతేకాదు వెంకటేష్ సెట్లో చాలా రిజర్వుడ్ గా ఉంటారని, పెద్దగా మాట్లాడేవారు కాదని భానుప్రియ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు.ఈ సినిమాలో వెంకీ తదేకంగా భానుప్రియ కళ్లలోకి కళ్లు పెట్టి చూసే సీను ఒకటి ఉంటుంది. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెంకీ దీని గురించి చెబుతూ తాను ఒక అమ్మాయిని అంతసేపు చూడడం అదే మొదటి సారి అని నవ్వేశాడు. దీనిపై భానుప్రియ స్పందిస్తూ అవును ఆ సీన్ లో వెంకటేష్ గారు అలానే తనను చూస్తూ ఉండిపోయారంటూ చెప్పింది భానుప్రియ.