స్వామి పరిపూర్ణానంద హౌస్ అరెస్ట్…

271
Sri-Paripoornananda
- Advertisement -

హిందూ దేవుళ్లపై, మత్తంపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా స్వామి పరిపూర్ణానంద నేడు ధర్మాగ్రహ యాత్ర ప్రారంభించనున్న విషయం తెలిసిందే. రాముడిని దూషించిన కత్తి మహేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బహీర్ బాగ్ నుంచి యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర చేయనున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు స్వామి పరిపూర్ణానందను హౌస్ అరెస్టు చేశారు. బషీర్ బాగ్ లోని భాగ్యలక్ష్మీ గుడికి బయలు దేరగా, ఇంటి వద్దనే స్వామిని పోలీసులు అడ్డుకున్నారు.

swamy paripurnanada

పాదయాత్రకు ఎలాంటి అనుమతి లేదని, ఆయన పాదయాత్రతో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని, ఈ సందర్భంగా అనుమతి ఇవ్వలేమని చెప్పారు. ఇక శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తిమహేష్ పై నగర బహిష్కరణ వేటు విధించారు పోలీసులు. శాంతి భద్రతకు విఘాతం కలిగించే విధంగా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. తమ అనుమతి లేకుండా కత్తిమహేష్ నగరంలోకి రావద్దని నోటీసులు పంపించారు.

- Advertisement -