ఇంగ్లండ్ గ‌డ్డ‌పై భార‌త్ సిరీస్ కైవ‌సం…

218
india won the series
- Advertisement -

ఇంగ్లాండ్ తో జరిగిన మూడవ వ‌న్డేలో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. నిన్న జ‌రిగిన మ్యాచ్ లో విజ‌యం సాధించి 2-1తేడాతో సిరీస్ కైవ‌సం చేసుకుంది. తొలి సారిగా ఇంగ్లండ్ గ‌డ్డ‌పై కోహ్లి సేన సిరీస్ సొంతం చేసుకుంది. సెంచ‌రీ చేసి మ్యాచ్ విజ‌యం లో కీల‌క‌పాత్ర పోషించాడు రోహిత్ శ‌ర్మ‌. మొద‌ట బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లండ్ భార‌త్ ముందు భారీ ల‌క్ష్యాన్ని ఉంచింది. నిర్ణిత 20ఓవ‌ర్ల‌లో 9వికెట్ల న‌ష్టానికి 198ప‌రుగులు చేశారు. మొద‌ట్లో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ల వికెట్లు తీయ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ్డ భార‌త్ బౌల‌ర్లు 94ప‌రుగుల వ‌ద్ద ఇంగ్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది.

team india

ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లలో జాస‌న్ రాయ్ 31 బంతుల్లో 67 ప‌రుగులు చేయ‌గా, జోస్ బ‌ట్ల‌ర్ 21బంతుల్లో 34 ప‌రుగులు చేశారు. ఇక మిగ‌తా వారంతో 20ప‌రుగుల లోపు చేసి అవుట‌య్యారు. టీంఇండియా ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా త‌న అద్భుత‌మైన బౌలింగ్ తో ఇంగ్లండ్ ప్లేయ‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. 4 వికెట్లు తీసి త‌న స‌త్తా చాటుకున్నాడు. సిద్ధార్ద్ కౌల్ రెండు వికెట్లు తీయ‌గా, దీప‌క్ చాహ‌ర్, ఉమేశ్ యాద‌వ్ లు చెర‌క వికెట్ తీశారు. భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన టీంఇండియా ఆట‌గాళ్లు అల‌వోక‌గా ప‌రుగుల చేసి విజ‌య‌న్ని సొంతం చేసుకున్నారు. ఇంకా 8బంతులు మిగిలి ఉండ‌గానే విజ‌యం సాధించారు. rohit sharma

ఓపెన‌ర్ బ్యాట్స్ మెన్ రోహిత శ‌ర్మ సెంచ‌రీ చేసి విజ‌యం లో కీల‌క పాత్ర పోషించాడు. 53బంతుల్లో 100ప‌రుగులు చేసి అరుదైన రికార్డు త‌న ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో మూడు సెంచ‌రీలు చేసిన భారత ఆట‌గాడిగా రికార్డు సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా టీ20ల్లో 2000ప‌రుగులు దాటిన ఆట‌గాడిగా మ‌రో రికార్డు కైవ‌సం చేసుకున్నాడు. విరాట్ కోహ్లి21 బంతుల్లో 43 పర‌గులు చేసి రోహిత్ శ‌ర్మ కు మంచి స్టాండింగ్ ఇచ్చాడు. ఇక ఈ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రోహిత్ శ‌ర్మ‌కు ల‌భించింది. ఇక ఈనెల 12నుంచి మూడు వ‌న్డేల సిరీస్ ప్రారంభం కానుంది.

- Advertisement -