సంజయ్ దత్ జీవితకథ ఆధారంగా సంజూ పేరుతో సినిమా ను తెరకెక్కించిన విషయం తెలిసిందే.ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతుంది. ఇక ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ సన్నిలియోన్ బయోపిక్ ను కూడా తెరకెక్కించనున్నవిషయం తెలిసిందే. కరణ్ జీత్ కౌర్ ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్ పేరుతో బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు.
సన్నీలియోన్ జీవితంలో ఎదుర్కున్న కష్టాలను, ఆమె పోర్న్ స్టార్ గా మారడానికి గల కారణాలను ముఖ్యంగా ఈసినిమాలో చూపించనునన్నారు. అయితే దీన్ని సినిమాలా కాకుండా ఓ వెబ్ సిరిస్ లా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈవెబ్ సిరీస్ లో సన్నీ లియోన్ పాత్రలో రైసా సౌజానీ అనే అమ్మాయి నటించింది.
తాజాగా ఈసినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రబృందం. సన్నీ లియోన్ చిన్న తనంలో తాను ఎదుర్కున్న కష్టాలు, తన అనుభవాలు, తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను, ఆతర్వాత ఆమె మెడలింగ్ లోకి ఎలా ప్రవేశించింది అనే అంశాలను ట్రైలర్ లో ఆకట్టుకుంటున్నాయి. ఈనెల 16న ఓ ఇంగ్లీషు ఛానెల్ లో ఈవెబ్ సిరీస్ ను ప్రసారం చేయనున్నారు.