సరికొత్త ఆఫర్లతో టెలికాం రంగంలోనే అగ్రస్ధానంలో దూసుకుపోతుంది రిలయన్స్ జియో. మొదట ఆరు నెలలు ఉచిత ఇంటర్నేట్, అన్ లిమిటెడ్ కాల్స్ లాంటి ఆఫర్లు ఇచ్చిన సంచలనం సృష్టించిన జియో త్వరలోనే మరో సంచనానికి తెరలేపుతుంది. అద్భుతమైన ఆఫర్లు తీసుకువస్తు వినియోగదారులకు శుభవార్త చెబుతుంది. ఇక ఇటివలే మరో ఆఫర్ ను కూడా ప్రకటించాడు రిలయన్స్ జియో అధినేత ముఖేశ్ అంబానీ. ఫైబర్ ఆధారిత బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ ను ది జియో గిగా ఫైబర్ పేరుతో దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు ముఖేశ్ అంబానీ.
జియో గిగా ఫైబర్ అందుబాటులోకి వస్తే, అల్ట్రా హై డెఫినిషన్, మల్టీ పార్టీ వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యాలను ఇంటి వద్ద పొందవచ్చన్నారు. త్వరలోనే ఈ ఫైబర్ ఆధారిత నెట్ ను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ ఫైబర్ వల్ల ప్రతి ఇల్లు స్మార్ట్ గా మారుతుందన్నారు. ఒక సెకనుకు గిగాబైట్ వేగంతో ఇంటర్నెట్ సేవలను అందిచనున్నామని తెలిపారు. జియో రాకతో ప్రజలకు అందుబాటు ధరలో నాణ్యమైన సేవలు దగ్గరయ్యాయన్నారు. జియో రావడం వల్ల చాల మంది స్మార్ట్ ఫోన్ ను వినియోగిస్తున్నారన్నారు.
జియో ఫోన్ కస్టమర్ల సంఖ్య భారీగా పెరిగిందని..ప్రస్తుతం ఫిక్సెడ్ లైన్ బ్రాడ్ బ్యాండ్ విస్తరణలో ఇండియా 134 స్ధానంలో ఉందని…ఈసంవత్సరం చివరలో టాప్ 100లోపలికి చేరుతుందన్నారు. ఫైబర్ నెట్ ను ఇళ్లకే కాకుండా చిన్న చిన్న కంపెనీలకు కూడా అందించనున్నట్లు తెలిపారు. ఇందుకుగాను త్వరలోనే 1,100 ముఖ్యమైన నగరాల్లో ఈసేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. వ్యాపారం చేసే వారి కోసం క్లౌడ్ అప్లికేషన్స్ మరింత వేగంగా పనిచేసే విధంగా బ్రాడ్ బ్యాండ్ సేవలను అందిస్తామన్నారు. త్వరలోనే మరన్ని సేవలను ప్రజలకు అందిచడానికి రిలయన్స్ జియో సంస్ధ ముందుటుందన్నారు ముఖేవ్ అంబానీ.