స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రం ద్వారా హీరోయిన్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఫిల్మ్ మేకర్ మహేష్ భట్ కూతురు అలియా భట్….బాలీవుడ్లో వేగంగా దూసుకెలుతోంది. హాట్ హీరోయిన్‌గా తనదైన ముద్ర వేస్తోంది. మొదటి సినిమా నుండే గ్లామర్ పరంగా తన తడాఖా చూపుతున్న అలియా భట్…చేసిన ప్రతి సినిమాలోనూ ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లతో వెండి తెరను వేడెక్కిస్తోంది. ఇక అందరీలాగానే తాను కూడా కొత్త కాపురం పెట్టబోతుందట. పెళ్లి కాకుండానే కొత్త ఇంట్లో.. కొత్త కాపురమేంటని సందేహమా ?
అదేం లేదు.. తాను కొత్తగా కట్టించుకున్న ఇంట్లోకి అలియా మారబోతోంది. అక్కాచెల్లెళ్లు అలియా, షహీన్‌లు గృహప్రవేశం రోజు రాత్రి తమ కొత్త ఇంట్లో ఏం చేయబోతున్నారో కూడా చెప్పేశారు.
‘ది ఫస్ట్‌నైట్ ఇన్ ది న్యూ హౌస్ విల్ బీ డెడికేటెడ్ టు మై పేరెంట్స్’ అని అలియా ట్వీటేసింది. తమ కొత్త ఇంట్లో ఫస్ట్‌నైట్ (తప్పుగా అర్థం చేసుకున్నారా?)ను తల్లిదండ్రులకు అంకితం ఇచ్చేసింది. ‘నా జీవితంలో ఆ ఫస్ట్‌నైట్ (కొత్త ఇంట్లో తొలిరాత్రి అనే) చాలా ముఖ్యమైన వేడుక. ఆ రోజు సన్నిహితులందరికీ గ్రాండ్ పార్టీ ఇస్తా’ అని చెబుతోంది. 23 ఏళ్లకే బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదగడంతోపాటు ఓ కొత్త ఇళ్లు కూడా కట్టుకున్న అలియాకు బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఆలియా ప్రస్తుతం షారుఖ్ ఖాన్‌తో డియర్ జిందగీ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆలియా సినిమాటోగ్రాఫర్‌గా నటిస్తోంది. ఆలియాకు ఎన్నో సమస్యలుంటాయి. వాటిని సాల్వ్ చేయడానికి షారుఖ్ వస్తాడు.