మహేష్ సెంటిమెంట్‌ వర్కవుట్‌ అయ్యేనా..!

276
mahesh babu
- Advertisement -

భరత్ అనే నేను సినిమా అందించిన హిట్‌తో ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు హీరో మహేష్‌. తన తర్వాతి కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్న మహేష్‌…రిలీజ్ విషయంలోనూ పాత సెంటిమెంట్‌కే జై కొడుతున్నాడు. పూరి జగన్నాథ్-మహేష్ కాంబినేషన్‌లో వచ్చిన పోకిరి అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులన్ని తిరగరాసింది. మహేష్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ సినిమాల్లో ఒకటిగా నిలిచిన పోకిరి యూత్‌ని బాగా ఆకట్టుకుంది. 2006 ఏప్రిల్‌లో విడుదలైన ఈ మూవీ భారీ వసూళ్లను రాబట్టింది.

బ్రహ్మోత్సవం అట్టర్ ఫ్లాప్ తర్వాత శ్రీమంతుడు సినిమాతో బ్లాక్ బస్టర్‌ హిట్ ఇచ్చిన కొరటాల శివతో భరత్ అనే నేను సినిమా చేసిన మహేష్‌ రెండోసారి వందకోట్ల క్లబ్‌లో అడుగుపెట్టాడు. 2018 ఏప్రిల్‌లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.

Image result for mahesh vamsi paidipally

ఇక ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు మహేష్‌. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ ఖరారు కాలేదు. మహేష్ 25వ సినిమాగా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వ్యవసాయం,రైతుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాజసం,రైతుబిడ్డ అనే టైటిళ్లు పరిశీలిస్తున్నారు. ఈ సినిమాను సైతం 2019 ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని మహేష్ చేస్తున్న ఈ ప్రయత్నం ఫలిస్తుందో లేదో వేచిచూడాలి.

- Advertisement -