ప‌వ‌న్ క‌ళ్యాణ్ నాకు ఎప్ప‌టి నుంచో తెలుసుః నూత‌న్ నాయుడు

351
pawan kalyan, nutan naidu
- Advertisement -

బిగ్ బాస్ 2లోకి సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చి రెండ‌వ వారంలోనే ఎలిమినెట్ అయ్యాడు నూత‌న్ నాయుడు. ఇంత‌కుముందు ఒక్క విశాఖ వాసుల‌కు మాత్ర‌మే తెలిసిన నూతన్ నాయుడు బిగ్ బాస్ 2 ద్వారా తెలుగు ప్రేక్ష‌కులంద‌రికి ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఈసంద‌ర్భంగా ఆయ‌న బిగ్ బాస్ షో గురించి మ‌రియు అత‌ని వ్య‌క్తి గ‌త విష‌యాల గురించి ప‌లు ఇంట‌ర్యూల‌లో ఆయ‌న చెబుతున్నాడు. ఈసంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో ఆయ‌న‌కు ఉన్న అనుబంధం గురించి ఓ ఇంట‌ర్యూలో తెలిపాడు.

Nutan naidu

ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో త‌న‌కు ఎప్ప‌టినుంచో ప‌రిచ‌యం ఉంద‌ని…ఈమ‌ధ్య కొన్ని రోజుల నుంచి కొంత దూరం పెరిగింద‌న్నారు. నాకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే చాలా అభిమానం అన్నారు. వ్య‌క్తి గ‌తంగా అత‌నంటే చాలా ఇష్టం మ‌ని..ఆయ‌న్ను అభిమానించే వాళ్ల‌లో నేను కూడా ఒక‌ర్ని అని తెలిపాడు. ప్ర‌జారాజ్యం పార్టీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌లిసి ప‌నిచేశాన‌ని..ఆ త‌ర్వాత చాలా గ్యాప్ వ‌చ్చింద‌న్నారు.

Nutan-Naidu

ఆయ‌న జ‌న‌సేన పార్టీ పెట్టాక నా స్నేహితులు చాలా మంది ఆయ‌న‌తో ప‌నిచేస్తున్నారు. కాని నాకు ఇంత‌వ‌ర‌కూ ఆహ్వానం అంద‌లేద‌ని..ప‌వ‌న్ కాకితో క‌బురు పంపినా వ‌ద్ద‌నుకుండా నేను ఆయ‌న త‌ర‌పున ప్ర‌చారం చేస్తాన‌ని చెప్పాడు. ప‌వ‌న్ స‌త్యానంద్ వ‌ద్ద ట్రైనింగ్ తీసుకుంటున్న‌ప్ప‌టి నుండి నాకు ప‌రిచ‌యం అని..అప్ప‌ట్లో మేము చాలా విష‌యాలు మాట్లాడుకునే వాళ్లం అని చెప్పారు. ఈవిధంగా ఆయ‌న ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.

- Advertisement -