మహారాష్ట్రలోని గోదావరిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు కేంద్ర జలవనరుల శాఖ అధికారులు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు 14గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ జలవనరుల సంఘం అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు. ప్రతి ఏటా జూన్ 30వ తేది దాటిన తర్వాత బాబ్లీ గేట్లు ఎత్తి నీటిని కిందకు వదలాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధికారులు నీటిని వదిలారు.
ప్రస్తుతం బాబ్లీ ప్రాజెక్టు వద్ద గోదావరి లో నిల్వ ఉన్న 0.56టీఎంసీల నీరు దిగువ గోదావరికి ప్రవహించగా..ఈ నీరు సాయంత్రం వరకూ తెలంగాణ సరిహద్దులు దాటనుంది. జూన్ 30వ తేది నుంచి ఆక్టోబర్ 28వ తేది వరకూ ఈగేట్లను తెరచి ఉంచనున్నారు అధికారులు. 120రోజుల పాటు తెలంగాణకు గోదావరి నీటిని విడుదల చేయనున్నారు.
సోమవారం ఉదయం వరకూ ఈనీరు నేరుగా శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి ఈనీరు చేరనుంది. దింతో శ్రీరాం సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ 2 టీఎంసీలకు పెరుగనుంది. ఎగువ నుంచి ఈ నీరు ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర వద్ద గోదావరి నదిలోకి చేరుతుంది. ఈ నేపథ్యంలో బాసర పుణ్యక్షేత్రం వద్ద పుణ్యస్నానాలు ఆచరించే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.