ఇప్పుడు ఎంతటి క్రేజ్ సంపాదించుకున్నా.. లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నా.. తారలకు కూడా తొలిప్రేమలు ఉంటాయి. వారు కూడా సినిమాలు చూసి పెరిగిన వారే కావడంతో.. అప్పటి స్టార్లను ఆరాధించడం సహజం. ఇప్పుడు అమలాపాల్ కు అలాంటి పరిస్థితే ఎదురైంది. కెరీర్ ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే తమిళ దర్శకుడు విజయ్ తో ప్రేమలో మునిగి తేలి, ఆ తర్వాత ఆయనను పెళ్లి చేసుకుంది అమలాపాల్. అయితే వారిద్దిరి మధ్య మనస్పర్థల రావడంతో, అతని నుంచి ఆమె విడిపోయింది. ప్రస్తుతం అమలాపాల్ సినిమాలతో బిజీగా ఉంది.
తాజాగా ఈ అమ్మడు ఓ కార్యక్రమంలో తన మొదటి ప్రేమ గురించి మాట్లాడుతూ, తనకు కూడా తొలి ప్రేమ ఉందని తెలిపింది. తన మొదటి ప్రేమికుడు మరెవరో కాదని… హీరో మాధవన్ అని చెప్పింది. చిన్నప్పటి నుంచి తనకు మాధవన్ అంటే ఎంతో ఇష్టమని తెలిపింది. ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఆమె పక్కనే మాధవన్ కూడా ఉన్నాడు. అమలాపాల్ చెప్పిన మాటలు విన్న మాధవన్… చిరునవ్వులు చిందిస్తూ ఉండిపోయాడు. అమలాపాల్ మాత్రం లేచి, అతన్ని హగ్ చేసుకుంది.