ఇండియా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ క్రికెట్ లో మంచి ప్రావిణ్యం ఉందన్న విషయం తెలిసిందే. అయితే అర్జున్ ఇటివలే అండర్ 19 జట్టుకు కూడా ఎంపికయ్యాడు. తండ్రి సలహాలతో తనదైన శైలిలో ఆటలో ప్రతిభను కనబరుస్తోన్నాడు. జులైలో శ్రీలంకలో అండర్ 19 మ్యాచ్ లు జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఈమ్యాచ్ లో సచిన్ తనయుడు అర్జున్ కూడా సెలక్టయ్యాడు. సచిన్ తనయుడు కాబట్టే అర్జున్ కు అండర్ 19లో స్ధానం కల్పించారని పలువురు కామెంట్లు చేశారు.
నెటిజన్లు చేస్తోన్న ఈకామెంట్లపై అండర్ 19 బౌలింగ్ కోచ్ సనత్ స్పందించారు. సచిన్ కొడుకు అయినంతమాత్రానే అతనికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వమని అందరితో పాటు అతనికి కూడా శిక్షణ ఇస్తామన్నారు. అందరు ఆటగాళ్లను ఎలా చూస్తామో అర్జున్ ను కూడా అలాగే చూస్తామన్నారు. ప్రాక్టిస్ లో అతనితో ఎలా వ్యవహారిస్తారని పలువురు అడగగా దాని గురించి నాకు అంతగా తెలియదన్నారు.
కోచ్ గా జట్టులోకి సభ్యులను ఎలా చూస్తానో అర్జున్ ను కూడా అలానే చూస్తానని చెప్పారు బౌలింగ్ కోచ్ సనత్. నా దృష్టిలో అర్జున్ భిన్నమైన ఆటగాడు ఏం అనుకోవట్లేదన్నారు. జట్టులో అందరిని అత్యత్తమ ప్రదర్శన కనబర్చేవాళ్లుగా చేయడం కోసం ఓ కోచ్ గా తాను కష్టపడతానన్నారు. అర్జున్ అండర్ 19కు సెలక్ట్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆయనపైనే ఉంది. ఎలాంటి ప్రతిభ కనబరుస్తాడొ అని అందరూ ఎదరుచూస్తోన్నారు.