అల్లు శిరీష్..’ఎబిసిడి’ మొదలైంది

288
Allu Sirish ABCD
- Advertisement -

అల్లు శిరీష్ కథానాయకుడిగా మలయాళంలో సూపర్ సక్సెస్ అందుకున్న ఎబిసిడి చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం లో జరిగింది. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్ హీరో హీరోయిన్ పై క్లాప్ నివ్వగా… సురేష్ బాబు కెమెరా స్విచ్చాన్ చేశారు.

అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టును మధుర ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాల నటుడిగా మనల్ని ఎంటర్టైన్ చేసిన మాస్టర్ భరత్ అల్లు శిరీష్ స్నేహితుడిగా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు ధీరజ్ మొగిలినేని కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

నటీనటులు అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్, భరత్,సాంకేతిక వర్గం,మ్యూజిక్ డైరెక్టర్ – జుధా సాంధీ,కో ప్రొడ్యూసర్ – ధీరజ్ మొగిలినేని,బ్యానర్స్ – మధుర ఎంటర్ టైన్ మెంట్, బిగ్ బెన్ సినిమాస్,నిర్మాతలు – మధుర శ్రీధర్, యష్ రంగినేని,దర్శకుడు – సంజీవ్ రెడ్డి.

https://twitter.com/AlluSirish/status/1008573399029837825

- Advertisement -