పెళ్లిచూపులు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు విజయ్ దేవరకొండ. ఆసినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన అర్డున్ రెడ్డి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా తన కంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు.అర్జున్ రెడ్డి మూవీ ఘన విజయం సాధించడంతో పాటు టాలీవుడ్ లో సంచలనాలు సృష్టించింది. దింతో ఈసినిమాకు పలు అవార్డులు కూడా లభించాయి. ఈసందర్భంగా ఇటివలే ప్రకటించిన ఫిలిం ఫేర్ అవార్డులలో ఉత్తమ నటుడిగా విజయ్ దేవరకొండ నామినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే శనివారం ప్రకటించిన ఈ అవార్డులలో విజయ్ కి ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది.
విజయ్ కి ఫిలిం ఫేర్ అవార్డు వచ్చిన సందర్భంగా ఆయన తన ట్వీట్టర్ లో తన ట్వీట్టర్ లో అభిమానులతో సంతోషాన్ని పంచుకున్నారు. తనకు వచ్చిన ఫిలిం ఫేర్ అవార్డును సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇచ్చేస్తానని చెప్పారు. ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అందుకున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు. నాకు నచ్చిన ఈసినిమా రంగాన్ని ఎంచుకున్నప్పుడే నేను గెలిచానన్నారు. అమ్మానాన్నలకు సొంతిల్లు కొన్నప్పుడు గెలిచినట్లు అనిపించిందన్నారు. ఈ అవార్డు నాకు ఒక బోసన్ లాంటిదని..సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇచ్చేందామనుకుంటున్నానన్నారు. ఈ అవార్డు నా ఇంట్లో ఉండటం కన్నా నేను పుట్టిన నగరానికి ఉపయోగపడం సంతోషకరంగా ఉందన్నారు.
Roju Twitter lo Chusta, entho mandi help adigithe, @KTRTRS anna CMRF nundi help chestaru. If my first award can be auctioned and money/awareness can be raised towards this, That'll be an epic 1st award.
— Vijay Deverakonda (@TheDeverakonda) June 17, 2018
ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ పై కూడా ప్రశసంల జల్లు కురిపించారు విజయ్. నేను అందుకున్న ఈ అవార్డును వేలం వేసి దాని ద్వారా వచ్చే డబ్బులను ఇతరులకు సాయం చేయడానికి ఉపయోగపడుతోందన్నారు. ఇలా చేసినప్పుడే ఈ అవార్డుకు విలువ ఉంటుందన్నారు. ఇక విజయ్ చేసిన ట్వీట్ కు మంత్రి కేటీఆర్ కూడా రిప్లే ఇచ్చారు. తొలి ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నందుకు విజయ్ కి శుభాకాంక్షాలు తెలిపారు. మికు వచ్చిన అవార్డును సీఎం రిలీఫ్ ఫండ్ కు సాయం చేయాలి అన్న మి ఆలోచన చాలా అభినందనీయం అన్నారు. ఇక విజయ్ స్పందిస్తూ సరే అన్నా ఈ రోజే మీ ఇంటికి వచ్చి లేదా..ఆఫీస్ వచ్చి కానీ అవార్డును మీకు ఇస్తానని ట్వీట్ చేశారు. ఇంత వరకూ ఎ హీరో చేయని పని చేసి విజయ్ టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ ను సృష్టిస్తున్నాడు.
Vijay, many congratulations on winning your first Filmfare 👏
Delighted you want to support the Chief Minister’s relief fund. My compliments to your thoughtful gesture👍
Let me revert on how we can go about this. Congrats again https://t.co/oObPZqBAEU
— KTR (@KTRTRS) June 17, 2018