చరణ్ తేజ్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నేను లోకల్ చిత్ర దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన స్టోరి, దర్శకత్వ పర్యవేక్షణలో, ప్రముఖ దర్శకుడు మారుతి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం ఆయష్మాన్భవ. ఈ చిత్రాన్ని సి టి.ఎఫ్ నిర్మాణ భాద్యతలు నిర్వహించారు. ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ కథనం తో రూపోందుతున్న ఈ చిత్రానికి బాలీవుడ్ లో బేబి డాళ్,
హంగ్ ఓవర్, హైహీల్స్ లాంటి సూపర్బ్ సాంగ్స్ కంపోజ్ చేసిన మీట్ బ్రోస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రం లో ప్రముఖ హీరో్యిన్ స్నేహ ఉల్లాల్ చరణ్ తేజ్ సరసన నటిస్తుంది. సమాజం ప్రేమని చూసే పద్దలి మారాలి అనే కమర్షియల్ పాయింట్ లో తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ నెల 21న ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వర రావు 75వ జన్మదినం సందర్భంగా ఆయుష్మాన్ భవ టీజర్ విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా చరణ్ తేజ్ మాట్లాడుతూ.. ముందుగా ఈ చిత్రానికి ఇంత మంచి కథ ని అందించటమే కాకుండా దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న సూపర్ సక్సెస్ ఫుల్ దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన గారికి, స్క్రీన్ప్లే అందించిన ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ కి నా హ్రుదయపూర్వక దన్యవాదాలు. అలాగే క్రేజి దర్శకుడు మారుతి గారి మా చిత్రానికి సహనిర్మాతగా
భాద్యతలు స్వీకరించినందుకు వారికి నా దన్యవాదాలు. మేము అడిగిన వెంటనే మా కథ నచ్చి మా చిత్రం లో హీరోయిన్ గా చేస్తున్న స్నేహ ఉల్లాల్ థ్యాంక్స్, స్నేహ ఉల్లాల్ పాత్ర చాలా బాగా డిజైన్ చేశాము. బాలీవుడ్ సూపర్ మ్యూజిక్ దర్శకుడు మీట్ బ్రోస్ మ్యూజిక్ అందిస్తున్నారు. మన తెలుగు స్టేట్స్ లో మీట్ బ్రోస్ అందించిన ఆడియోను యూత్ విపరీతంగా ఎంజాయ్
చేస్తున్నారు. ఇప్పడు డైరక్ట్ గా వాళ్ళు మా చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి కులం, మతం వేరైతే.. మర్చిపోవాలా.. పారిపోవాలా.. చచ్చిపోవాలా.. ప్రపంచం ఏమైతే నాకేంటి సమాజం ప్రేమని చూసే విధానం మారాలి లేకపోతే చంపేస్తా .. అనుకునే హీరో క్యారక్టరైజేషన్ తో ఈ చిత్రం తెరకెక్కింది. ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ నెల 21న ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వర రావు గారి 75వ జన్మదినం సందర్భంగా ఆయుష్మాన్ భవ టీజర్ విడుదల చేస్తున్నాం. షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందని నమ్ముతున్నాము అని అన్నారు.