మన క్రికెట్లో విధ్వంసం పుట్టినరోజు.. నేడు

285
Virender Sehwag on 38th birthday
Virender Sehwag on 38th birthday
- Advertisement -

భారత క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు, రెండు ట్రిపుల్ సెంచరీల మొనగాడు.. మైదానంలో ఓ బ్యాట్స్‌మెన్‌ స్కోరు 90లోకి వచ్చిదంటే చాలు.. అప్పటి వరకు విధ్వంసకరంగా ఆడిన హిట్టరైనా నెమ్మదించేస్తాడు. కానీ.. స్పిన్నర్‌ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చి ఫీల్డర్ల నెత్తిమీదుగా ఓ భారీ సిక్స్‌ కొడితే. ఆ హిట్టర్‌ తెగింపును చూసి ప్రత్యర్థి ఆటగాళ్లే కాదు.. మ్యాచ్‌ను వీక్షిస్తున్న క్రికెట్‌ ప్రపంచమే సంభ్రమాశ్చర్యానికి గురైంది. ఆ అసాధారణ విధ్వంసకారుడు వీరేంద్ర సెహ్వాగ్ పుట్టినరోజు నేడు(అక్టోబర్‌ 20).

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత సెహ్వాగ్ సోషల్‌ మీడియాలో కూడా తనదైన డాషింగ్‌ స్టైల్లో అందరినీ ఆటపట్టిస్తూ, మాజీ ఆటగాళ్లకు పుట్టిన శుభాకాంక్షలు తెలుపుతున్నాడు. ఇక సెహ్వాగ్‌కు గురువారం ఉదయం నుంచే పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘#HappyBirthdayViru’ అంటూ ట్విట్టర్‌లో ట్రెండింగ్ అవుతుంది. ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్‌గా సెహ్వాగ్ చాలా బిజీ లైఫ్‌ను గడుపుతున్నారు. భారత్ తరుపున 104 టెస్టులాడిన సెహ్వాగ్ 8586 పరుగులు చేయగా, 251 వన్డేలాడిన 8273 పరుగులు సాధించాడు.

hqdefault

నిమిషాల వ్యవధిలోనే మ్యాచ్‌ స్థితి.. గతిని మార్చేసే సెహ్వాగ్‌.. అక్టోబరు 20, 1978లో పుట్టిన వీరేంద్ర సెహ్వాగ్‌ గురువారం 38వ వసంతంలోకి అడుగుపెట్టాడు. 1999, ఏప్రిల్‌ 1న పాకిస్థాన్‌తో జరిగిన వన్డేతో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగ్రేటం చేసిన సెహ్వాగ్‌.. అతి తక్కువ కాలంలోనే విధ్వంసకారుల జాబితాలో చేరిపోయాడు.

Virender-Sehwag-enjoying-with-Sachin-Tendulkar

అప్పటి వరకు భారత్‌ తరపునా ఒక్క బ్యాట్స్‌మన్‌ కూడా ట్రిపుల్‌ సెంచరీ నమోదు చేయలేదు. అలాంటిది భారత్‌ తరపునా ఓ అరుదైన రికార్డ్‌ నమోదు చేయబోతుంటే ఏ బ్యాట్స్‌మన్‌కైనా వణుకు ఉంటుంది. కానీ మన వీరూకి అలాంటి భయాలేం లేవని ఒక్క సిక్సర్‌తో తెల్చేశాడు. అది కూడా మన చిరకాల ప్రత్యర్థి పాక్‌తో 2004, మార్చి 28న ముల్తాన్‌ క్రికెట్‌ స్టేడియంలో ఆరంభమైన తొలి టెస్టు మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌ (309: 375 బంతుల్లో 39×4, 6×6) ట్రిఫుల్‌ సెంచరీతో చెలరేగాడు. వ్యక్తిగత స్కోరు 295 వద్ద స్పిన్నర్‌ ముస్తాక్‌ బౌలింగ్‌లో సెహ్వాగ్‌ క్రీజు వెలుపలికి వచ్చి మిడ్‌ వికెట్‌ దిశగా కళ్లు చెదిరే రీతిలో సిక్స్‌ బాదేశాడు. అయితే ఈ అరుదైన ట్రిపుల్‌ సెంచరీ ఘనతను అందుకున్న కొన్ని నిమిషాలకే సెహ్వాగ్‌ ఔటైపోయినా.. భారత్‌ తరఫున ఈ ఫీట్‌ సాధించిన ఏకైక క్రికెటర్‌గా చరిత్రలో నిలిచిపోయాడు.

389229-sehwagtendulkar-getty

ఈ సిక్సర్‌కి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని వీరూ.. అప్పట్లోనే వెల్లడించాడు. పాకిస్థాన్‌తో ముల్తాన్‌ టెస్ట్‌లో సచిన్‌, తాను(సెహ్వాగ్‌) భారీ భాగస్వామ్యం నెలకొల్పామని, నాలుగో సిక్స్‌ కొట్టిన తర్వాత సచిన్‌ తన వద్దకు వచ్చి.. నువ్యు మరోసారి సిక్స్‌ కొడితే నిన్ను బ్యాట్‌తో కొడతానని అన్నట్లు తెలిపాడు. ఆ సమయంలో తాను సెంచరీ పైచిలుకు స్కోరుతో ఆడుతున్నానని, మాస్టర్‌ సూచనలు పాటించి 295 పరుగుల వరకూ ఒక్క సిక్స్‌ కూడా కొట్టలేదని చెప్పాడు. అయితే సక్లయిన్‌ వస్తే మాత్రం సిక్స్‌ కొడతానని టెండూల్కర్‌కు చెప్పానని, ఆ తర్వాత సక్లయిన్‌ బౌలింగ్‌కు దిగడం భారీ సిక్సర్‌తో ట్రిపుల్‌ సెంచరీ పూర్తి చేయడం జరిగిపోయాయని అతను చెప్పాడు. సెహ్వాగ్‌ ట్రిపుల్‌ కారణంగా ముల్తాన్‌ టెస్ట్‌లో పాకిస్తాన్ ఓటమి పాలైంది.

sehwah

సెహ్వాగ్ రికార్డులు:
* టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెకండ్, థర్డ్ డబుల్ సెంచరీలు. అలాగే టెస్టుల్లో 10 వేగవంతమైన డబుల్ సెంచరీల్లో 5 సెహ్వాగ్ వే.
* వన్డే మ్యాచ్లో మూడో అత్యధిక స్కోరు సెహ్వాగ్ దే.
* టెస్ట్ ఇన్నింగ్స్ లో 47 ఫోర్లు బాదిన సెహ్వాగ్ రెండో స్థానంలో ఉన్నాడు. 52 ఫోర్లతో జాన్ ఎడ్రిచ్ తొలి స్థానంలో ఉన్నాడు.
* ఒక వన్డే మ్యాచ్ లో అత్యధిక ఫోర్లు (25) బాదిన జాబితాలో సెహ్వాగ్ ది రెండో స్థానం.
* వరుసగా 11 సెంచరీలను సెహ్వాగ్ 150+ స్కోరుగా మలిచాడు.
* టెస్ట్ క్రికెట్ లో రెండు ట్రిపుల్ సెంచరీలు, ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్ సెహ్వాగ్.
* టెస్టుల్లో 5 సార్లు మ్యాన్ ఆఫ్ ది సిరీస్, 8 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.
* వన్డేల్లో రెండు సార్లు మ్యాన్ ఆఫ్ ది సిరీస్, 22 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.

- Advertisement -