సాయి ధరమ్ తేజ్ మెగా ఫ్యామిలి నుంచి ఎంట్రీ ఇచ్చి తన కంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్, గుర్తింపు సంపాదించుకున్నాడు. మొదట్లో మంచి విజయాలతో దూసుకెళ్లిన తేజ్ ప్రస్తుతం ప్లాప్ సినిమాలతో సతమతమవుతున్నాడు. సుప్రీమ్ సినిమాతో స్టార్ డమ్ ను ఎర్పరచుకున్నాడు సాయి ధరమ్ తేజ్. కథలను ఎంచుకోవడంలో ఫ్లాప్ అయ్యాడనే చెప్పుకొవాలి. ఒక ప్రస్తుతం తేజ్ ఐలవ్ యూ అనే సినిమాలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఈ మెగా హీరో.
అయితే ఈచిత్రానికి సంబంధించిన ఆడియో ఫంక్షన్ నిన్న నిర్వహించారు. ఈ ఆడియో వేడుకకి ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ప్లాప్ లతో ఇబ్బందిపడుతున్న తేజ్ కు మరో మెగా హిట్ ఇచ్చేందుకు ఈఫంక్షన్ కు వచ్చారు చిరంజీవి. ఈఫంక్షన్ లో తేజ్ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లండించారు. తనకు చిరంజీవి అంటే చాలా ఇష్టం అని..ఆయన నటించిన ప్రతి సినిమాను చూసాను అని చెప్పారు. మామయ్య చిరంజీవి అంతే తనకు ఎంత ఇష్టం అంటే రోజు ఉదయం లేవగానే నేను చిరంజీవి గారి ఫోటోను చూస్తానని తెలిపాడు. నా దృష్టిలో ఆయన దేవుడు అన్నారు.
ఇలా చిరంజీవి పై తేజ్ పలు ప్రశంసలు కురిపించాడు. ఈసినిమాకు ప్రేమకథల స్పెషలిస్టగా పేరుగాంచిన కరుణాకరణ్ దర్శకత్వం వహించాడు. పవన్ కళ్యాణ్ కు తొలిప్రేమ ఎంతపెద్ద విజయాన్ని ఇచ్చింది…తేజ్ కు కూడా ఈసినిమా అంత పెద్ద హిట్ ఇస్తుందన్నారు చిరంజీవి. తేజ్ సరసన హీరోయిన్ గా అనుపమా పరమేశ్వరన్ నటించారు. ఈచిత్రాన్ని కేఎస్. రామారావు నిర్మించగా.. గోపిసుందర్ సంగీతం అందించారు. జూన్ 29 న ఈచిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు చిత్ర యూనిట్. ఈ ఫంక్షన్ కు డైరక్టర్లు హరిష్ శంకర్, బీవీఎస్ రవి పలువురు నటినటులు హాజరయ్యారు.