- Advertisement -
రెండు రోజుల క్రితం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైనపు విగ్రహం దేశ రాజధాని ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఐతే, ఈ విగ్రహం ఏర్పాటుచేసిన రెండు రోజులకే దెబ్బతింది. పెద్ద సంఖ్యలో కోహ్లీ అభిమానులు సెల్ఫీలు,ఫోటోలు దిగేందుకు ఎగబడటంతో కోహ్లీ మైనపు విగ్రహాం స్వల్పంగా దెబ్బతింది.
కోహ్లీ కుడి చెవి పైభాగం పాక్షికంగా దెబ్బతింది. వెంటనే గమనించిన మ్యూజియం నిర్వాహకులు వెంటనే మరమ్మతు చర్యలు చేపట్టారు. దెబ్బతిన్న కోహ్లీ మైనపు విగ్రహం ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ మ్యూజియంలో ఇప్పటికే క్రికెట్ దిగ్గజాలు కపిల్‌దేవ్, సచిన్ టెండూల్కర్‌తో పాటు మెస్సీ (ఫుట్‌బాల్), ఉసేన్ బోల్ట్ (స్పింటర్) విగ్రహాలు కొలువుదీరాయి. త్వరలో మహేంద్ర సింగ్ ధోని విగ్రహం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు నిర్వాహకులు.
- Advertisement -