చైతు మూవీ కోసం రంగంలోకి రమ్మకృష్ణ ..

365
Ramya Krishna
- Advertisement -

టాలీవుడ్‌ డైరెక్టర్‌ మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో అత్త పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు. అను ఇమ్మానియేల్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

Naga Chaitanya

ఈ సినిమా ఇప్పటికే 50 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. మిగతా 50 శాతం చిత్రీకరణకు పక్కాగా ప్లాన్ చేశారు. ఈ నెల 18వ తేదీ నుంచి హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో తదుపరి షెడ్యూల్ షూటింగును 15 రోజుల పాటు చిత్రీకరించనున్నారు. అయితే రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరగనున్న ఈ షెడ్యూల్‌లోనే అత్తగా రమ్యకృష్ణ సెట్లో అడుగుపెట్టబోతున్నారు.

Ramya Krishna

ఇక సొగసరి అత్తగా గడసరి అల్లుడుగా ఈ సినిమాలో రమ్యకృష్ణ ,చైతూ మధ్య ఆసక్తికరమైన సన్నివేశాలు వున్నాయట. మాస్ ఆడియన్స్ చేత విజిల్స్ వేయించే ఆ సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరిస్తారట. జులైలో రాజమండ్రి, అమలాపురంలో మరో షెడ్యూల్‌ తెరకెక్కిస్తారు. ఆగస్టు చివరి వారంలో చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనీట్. ఈ మూవీకి గోపీ సుందర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

- Advertisement -