ఫుట్‌బాల్‌ కోచ్‌గా బిగ్ బి

230
- Advertisement -

‘సైరత్‌’ మూవీ మరాఠీలో సంచలన విజయ అందుకుంది. రూ.100 కోట్లు వసూళ్లు చేసిన తొలి మరాఠీ చిత్రంగా రికార్డు సృష్టించింది ఈ చిత్రం. దీంతో ఈమూవీ దర్శకుడు నాగ్‌రాజ్‌ మంజులె పేరు బాలీవుడ్‌లో బాగా వినిపిస్తోంది. అంతేకాదు ఏకంగా అమితాబ్‌ బచ్చన్‌తో సినిమా చేసే అవకాశం అందుకున్నాడు. ‘ఝండ్‌’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో అమితాబ్‌ ప్రధాన పాత్రలో నటించనున్నాడు. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఆసక్తికరమైన వివరాలు బటికొచ్చాయి.

Amitabh Bachchan

ఈ చిత్రంలో అమితాబ్‌ రిటైర్‌ కోచ్‌గా నటించనున్నారట. ఓ మురికివాడలోని పిల్లలను చేరదీసి వారిని ఫుట్‌బాల్‌ క్రీడలో మెరికలుగా తీర్చిదిద్దేలా అమితాబ్‌ పాత్ర ఉండబోతుందని సమాచారం. మాదక ద్రవ్యాల వ్యసనంతో నేరాలకు పాల్పడే పిల్లలకు ఆటల్లోని మజా రుచి చూపించి వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే వ్యక్తిగా అమితాబ్‌ నటించబోతున్నాడని సమాచారం.

ఈ మూవీ స్లమ్‌ సాకర్స్‌ సంస్థను స్థాపించి మురికివాడల పిల్లలకు ఫుట్‌బాల్‌ ఆటలో శిక్షణ ఇస్తున్న విజయ్‌ బర్సె అనే వ్యక్తి జీవితం ఆధారంగా తెరకెక్కబోతోందట. త్వరలో ఈ చిత్రాన్ని సెట్స్‌ మీదకు తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

- Advertisement -