కన్నడ సీఎంకు తలైవా రిక్వెస్ట్..

304
Rajinikanth'
- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కాలా చిత్రం ప్రపంచావ్యాప్తంగా రేపు విడుదల కానుంది. ఇప్పటికే కర్ణాటకలో కాలాపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కన్నడ సీఎం కుమార స్వామి‎కి తలైవా రిక్వెస్ట్ చేశారు. కాలా విడుదలకు సహకరించాని కోరారు. కాలా విడుదలయ్యే థియేటర్ల వద్ద భద్రత కల్పించాలని ఆయన ఓ సందేశం ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే కాలా రిలీజ్‎ను అడ్డుకోలేమని కర్ణాటక హైకోర్టు కూడా మంగళవారం క్లియరెన్స్ ఇచ్చింది. భద్రత విషయంతో మాత్రం ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేసింది.

‎Rajinikanth Kaala

ఈ నేపథ్యంలో సీఎం కుమార స్వామి మట్లాడుతూ.. కోర్టు తీర్పును గౌరవిస్తాం. కానీ ఓ కనడిగుడిగా చెబుతున్నా.. ఇలాంటి పరిస్థితుల్లో కాలాను విడుదల చేయకపోవడమే మంచిది అని చెప్పారు. తాజా పరిస్థితుల దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను విడుదల చేయడం మంచిది కాదని నిర్మాతకు, పంపిణీ దారులకు సూచిస్తున్నా అంటూ చెప్పారు. ఈ నేపథ్యంలో రజనీ సీఎం కుమారస్వామికి విజ్ఞప్తి చేయడం విశేషం.

కావేరి జలాల విషయంతో రజనీ చేసిన వ్యాఖ్యలపై కన్నడిగులు ఆగ్రహంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితులో సినిమా విడుదలను అడ్డుకుంటామని కన్నడ సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. కాలా విడుదలపై నటుడు ప్రకాష్‎రాజ్ కూడా స్పందించారు. కాలాకు.. కావేరికి సంబంధం ఏంటి అని ప్రశ్నించారు. రజనీకాంత్ ఒక్కరు చేసిన వ్యాఖ్యలకు చిత్ర సభ్యులందరూ నష్టపోవాలా అన్నారు. ఈ విషయంతో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సూచించారు. అలాగే కావేరి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని త్వరగా పరిష్కారం చూపించాలన్నారు. మరి రేపు కన్నడనాట కాలా రిలీజ్ అవుతుందో లేదో వేచి చూడాలి ఇక.

- Advertisement -